దడ పుట్టిస్తుందిగా.. వివాదాలన్నీ వాటి కారణంగానే..?

ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు సోషల్ మీడియా దెబ్బకు దడదడలాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన వివాదాలన్నీ నేడు సోషల్ మీడియా వల్లే జరుగుతున్నవి కావడం గమనార్హం. అనంతపురం [more]

Update: 2021-01-02 09:30 GMT

ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు సోషల్ మీడియా దెబ్బకు దడదడలాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన వివాదాలన్నీ నేడు సోషల్ మీడియా వల్లే జరుగుతున్నవి కావడం గమనార్హం. అనంతపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వరకు ఎమ్యెల్యేలు, ఎంపీల స్థాయిలో వీధి పోరాటాలకు సోషల్ మీడియా లో వచ్చే పోస్ట్ లే కారణం అయ్యాయి. ఈ వివాదాలే కాదు ఇటీవల హైదరాబాద్ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా పోస్ట్ లు పార్టీల జయాపజయాలు నిర్ణయించేశాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా టీం లను ప్రధాన నేతలంతా ఏర్పాటు చేసుకోవడంలో బిజీ అయిపోయారు.

కేసులు కూడా భారీగానే …

ఇక నేతలు ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో పెట్టె పోస్ట్ ల పై కేసుల పై కేసులు పెట్టుకుంటూ రాజకీయాలను హీటేక్కిస్తున్నారు. దాంతో ఇప్పుడు పోలీసులకు నిజమైన తలపోటు ఏర్పడింది. సైబర్ క్రైమ్ విభాగానికి పని భారం పెరిగిపోతుంది. ఒకప్పుడు పత్రికలు ఛానెల్స్ లో వచ్చే వాటిపైనే వివాదాలు నడిచేవి. అయితే ఆ యుగం క్రమంగా ముగిసిపోతుంది.

సొంతంగా సోషల్ మీడయా…

రాజకీయ పార్టీల కరపత్రికలుగా మీడియా మారిపోవడంతో ఎవరికి వారే సొంత సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థుల భరతం పట్టే పనిలో పడ్డారు.వీరు వేలు లక్షల సంఖ్యలో ఉండటంతో ఎవరు ఎప్పుడు ఏ పోస్ట్ పెడతారో దానివల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అర్ధం కాని పరిస్థితి నడుస్తుంది. దీంతో పోలీసులు సయితం సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు

Tags:    

Similar News