వీరికి కనెక్ట్ కావడం లేదట

అసలు సమస్య వారిదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వందరోజుల్లోనే జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తుండటమే [more]

Update: 2019-09-12 08:00 GMT

అసలు సమస్య వారిదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వందరోజుల్లోనే జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణమని పొలిటికల్ సర్కిళ్లలో హాట్ హాట్ చర్చజరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పోలవరం, అమరావతి పనులను మాత్రమే నిలిపేశారు. ఇదే బయటకు తెలిసిన నిజం. వాళ్లు పెద్దకాంట్రాక్టర్లుకావడంతో కొంత తట్టుకునే శక్తిఉంది. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వారు వెనకాడరు.

అనేక కాంట్రాక్టులను….

అలాగే సీఎం రమేష్ కు సబంధించి హంద్రీ నీవా కాంట్రాక్టును కూడారద్దు చేశారు. వందల కోట్ల నష్టమొచ్చినా సీఎం రమేష్ భరించాల్సిందే. అయితే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన చిన్నాచితకా అనేక కాంట్రాక్టు పనులు కూడా వందల కోట్ల రూపాయల విలువైనవి ఉన్నాయి. టీడీపీ సానుభూతి పరులకు, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ కాంట్రాక్టులను అప్పగించారన్నది వైసీపీ ఆరోపణ. అందుకే పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ ఇలా ప్రతి ఒక్క శాఖలో ఎన్నికలకు ముందు అప్పగించిన కాంట్రాక్టులన్నింటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.

వందల కోట్లు…

దీంతో కాంట్రాక్టర్ లు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. దాదాపు అన్నిరాజకీయ పార్టీల నేతల వద్దకు తిరుగుతున్నారు. ప్రధానంగా జనసేన,బీజేపీ అగ్రనాయకులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పనులు కొంత మేర పూర్తయి ఇప్పుడు నిలిచిపోయాయి. దీంతో వారు విపక్ష నేతల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు.

మంత్రిని కలిసినా…..

కోస్తా జిల్లాలోని ఒక వైసీపీ ఎమ్మెల్యే ను కూడా వారు కలసి తమకు బిల్లులు వచ్చేలా చేస్తే కమీషన్ ఇస్తామని కూడా చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో కాంట్రాక్టులన్నింటిలో కొన్నింటిని రద్దు చేయడం, మరికొన్ని పనులు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదు. విపక్ష నేతలతో పనికాదని తెలుసుకున్న కాంట్రాక్టర్లు కొందరు మంత్రుల వద్దకు వెళుతున్నారు.ఒక సీనియర్ మంత్రి వద్దకు వెళ్లిన కాంట్రాక్టర్లకు మంత్రి సమాధానం విని దిమ్మెరపోయారట. ఆ బిల్లుల గురించి మర్చి పోవడమే బెటర్ అని సదరు మంత్రి చెప్పడంతో కాంట్రాక్టర్లందరూ యూనియన్ గా ఏర్పడి న్యాయపోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News