మోడీ… ఇక కఠినంగా ఉండకు ప్లీజ్..!!

రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు దాటి పోయింది. ఇంతవరకూ రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి [more]

Update: 2020-04-06 03:30 GMT

రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు దాటి పోయింది. ఇంతవరకూ రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అందించాల్సిన చేయూతను అందివ్వలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2019 వరకూ తన మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాను ఇవ్వబోమని తెగేసి చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది.

ఆరేళ్లు గడుస్తున్నా….

కానీ ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ కు చేరలేదు. ఇందుకు అనేక కొర్రీలు కేంద్ర ప్రభుత్వం వేయడమే కారణం. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి కొత్తగా జగన్ ప్రభుత్వం వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికి ఏడుసార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలసి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కొంత మేరకు ఇటీవల విడుదల చేశారు.

తీరని నష్టంతో…

అయితే కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం జరిగింది. కొత్త రాష్ట్రం కావడంతో ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో నిర్లక్ష్యం చేసిన రాష్ట్రాన్ని ఇప్పడు కూడా ఆర్థికంగా ఆదుకోకుంటే కేంద్ర ప్రభుత్వం ఉండీ లేనట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కరోనా దెబ్బకు ఆదాయం పూర్తిగా కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర వైపు చూడటం తప్ప ఏపీకి మరో అవకాశం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సాయం అందించాలని ప్రధాని మోడీని కోరారు.

అందరూ ఒక్కటై….

రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడే విపక్షాలు సయితం ఈ సయమంలో కేంద్రంపై వత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా రాష్ట్ర బీజేపీనేతలు, ఆపార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం కేంద్రప్రభుత్వం నుంచి నిధులను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై తర్వాత విమర్శలు చేసుకోవచ్చు. దానికి ఇంకాచాలా సమయం ఉంది. ముందు రాష్ట్రాన్ని ఆర్థిక గండం నుంచి గట్టెక్కించడానికి అందరూ కలసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News