పాపం.. చౌహాన్… వేళావిశేషం..బాగాలేదు

శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాధ్ బలం లేక ముఖ్యమంత్రి [more]

Update: 2020-04-12 17:30 GMT

శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాధ్ బలం లేక ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఛాన్స్ చిక్కింది. ఆయనగను గవర్నర్ లాల్జీ టాండన్ ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గాన్ని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించుకోలేదు.

కరోనా సమయంలోనే….

ఈలోగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. అప్పటికే భారత్ లో లాక్ డౌన్ విధించారు. అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ పాటించడంతో మధ్యప్రదేశ్ కూడా లాక్ డౌన్ ను విధించింది. అయితే మధ్యప్రదేశ్ కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న ఇండియాలో టాప్ టెన్ లో ఉంది. మధ్యప్రదేశ్ లో ిఇప్పటికే 300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18 మంది వరకూ చనిపోయారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ లో ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలతో కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

లాక్ డౌన్ ను పొడిగించాలంటూ…

లాక్ డౌన్ ను పొడిగించాలని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రుల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒకరు. లాక్ డౌన్ ను కంటిన్యూ చేయకుంటు మధ్యప్రదేశ్ లో కరోనాను కట్డడి చేయడం అసాధ్యం. మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారితో ఎక్కువ సంఖ్యలో కన్పిస్తున్నా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తుది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా కన్పిస్తుండటంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ తో మొదలు….

మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రిన్పిసల్ కార్యదర్శి పల్లవి జైన్ కు కూడా కరోనా వైరస్ సోకింది. పల్లవి జైన్ కుమారుడు మార్చి 16న అమెరికా నుంచి వచ్చారు. అయితే ఆమె ఈ విషయాన్ని దాచి పెట్టారు. ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలకు కూడా పల్లవి జైన్ హాజరయ్యారు. పల్లవి జైన్ తర్వాత సెక్రటేరియట్ లో 32 మంది అధికారులకు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో కొన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా క్వారంటైన్ కు వెళ్లారు. దీంతో పరిస్థితి అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది. మొత్తం మీద శివరాజ్ సింగ్ చౌహాన్ పదవిలోకి రావడమే కరోనా స్వాగతం చెప్పినట్లయింది. ఇప్పుడు చౌహన్ కు కరోనాను కంట్రోల్ చేయడమే పరీక్ష.

Tags:    

Similar News