బద్వేల్ భయపెడుతుందా? ఇద్దరికీ సవాల్…?

బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఆరు నెలల్లో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వైసీపీ అధినేత [more]

Update: 2021-04-22 14:30 GMT

బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఆరు నెలల్లో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వైసీపీ అధినేత జగన్ఇప్పటికే బద్వేల్ ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకే టిక్కెట్ కేటాయించే అవకాశాలున్నాయి. ఈ మేరకు జగన్ వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ బరిలో ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ఉప ఎన్నికలో….

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత వస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నిక ఇది. సంప్రదాయం ప్రకారం అయితే మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకే అవకాశమిచ్చినప్పుడు విపక్షాలు పోటీకి దూరంగా ఉండాలి. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ సంప్రదాయానికి తెరపడింది. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నంద్యాల ఉప ఎన్నికల్లో సంప్రదాయాన్ని పాటించలేదు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలో అన్ని పార్టీలూ పోటీ చేశాయి.

టీడీపీ ట్రాక్ రికార్డ్….

ఇక బద్వేల్ లోనూ అదే పద్ధతిని పాటిస్తాయంటున్నారు. బద్వేల్ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో ఉంది. అయినా బద్వేల్ లో టీడీపీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 1983, 1985, 1994, 1999 ఎన్నిలకలో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే అప్పటి వరకూ బద్వేల్ నియోజకవర్గం రిజర్వడ్ నియోజకవర్గం కాదు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయిన తర్వాత బద్వేల్ లో టీడీపీ ఇంతవరకూ విజయం సాధించలేదు. ఇక్కడ కాంగ్రెస్, వైసీపీలే గెలుస్తూ వస్తున్నాయి.

గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని….

మొన్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కడప జిల్లా మైదుకూరులో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో చంద్రబాబు బద్వేల్ నియోజకవర్గంలో మరోసారి తాము సత్తా చాటాలని భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అయిన తర్వాత కడప జిల్లా నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై బద్వేల్ పై ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దీనిపై అభ్యర్థి కోసం సర్వే చేయించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీని సిద్ధం చేస్తున్నారు.

Tags:    

Similar News