శిల్పా వదిలిపెట్టడం లేదుగా

క‌ర్నూలు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నంద్యాల‌. ఇక్కడ దివంగ‌త భూమా నాగిరెడ్డికి మంచి పేరుంది. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా.. ప్రజ‌లు బ్రహ్మర‌థం ప‌ట్టారు. నాగిరెడ్డి కుటుంబానికి [more]

Update: 2020-01-09 13:30 GMT

క‌ర్నూలు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నంద్యాల‌. ఇక్కడ దివంగ‌త భూమా నాగిరెడ్డికి మంచి పేరుంది. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా.. ప్రజ‌లు బ్రహ్మర‌థం ప‌ట్టారు. నాగిరెడ్డి కుటుంబానికి ఆళ్లగ‌డ్డలో ప‌ట్టు ఉన్నా..ఆయ‌న నంద్యాల ఎంపీగా గెల‌వ‌డంతో ఇక్కడ కూడా త‌న‌కంటూ ఓ వ‌ర్గం ఏర్పాటు చేసుకున్నారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న వెంటే ఆ వ‌ర్గం న‌డుస్తూ వ‌చ్చింది. 2004, 2009లో వైఎస్ ప్రభావంతో ఇక్కడ కాంగ్రెస్ విజ‌యం సాధించి రికార్డు సృష్టించింది.

రెండుసార్లు గెలిచినా….

శిల్పా మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్కడ రెండు సార్లు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, 2014లో ఇక్కడ నుంచి భూమా నాగిరెడ్డి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి విజ‌యం సాధించారు. దీంతో శిల్పా మోహ‌న్‌రెడ్డి ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకుని పోటీ చేసి ఓడిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్సహించ‌డంతో నాగిరెడ్డి మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో పార్టీ మారిపోయారు. త‌మ‌కు ప‌ట్టున్న నియోజక‌వ‌ర్గంలో భూమా నాగిరెడ్డి హ‌వా చెలాయించండంతో శిల్పా వ‌ర్గం రాజ‌కీయంగా సందిగ్ధంలో ప‌డిపోయింది.

జగన్ ప్రచారం చేసినా….

2017 ఉప ఎన్నిక‌ల్లో చంద్రబాబు టికెట్ నిరాక‌రించ‌డంతో అప్పటి వ‌ర‌కు టీడీపీలో ఉన్న శిల్పా కుటుంబం వైసీపీకి జంప్ చేసింది. భూమా మ‌ర‌ణంతో జ‌రిగిన ఉప పోరులో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన బ్రహ్మానంద‌రెడ్డి అనూహ్య విజ‌యం సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఏకంగా 27 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఈ ఎన్నిక కోసం జ‌గ‌న్ ఏకంగా 14 రోజుల పాటు నంద్యాల‌లోనే ప్రచారం చేశారు.

గెలిచిన నాటి నుంచి….

వైసీపీ సిట్టింగ్ సీటు కావ‌డంతో అటు జ‌గ‌న్‌, ఇటు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం కావ‌డంతో చంద్రబాబు స‌వాల్‌గా తీసుకున్నారు. ఆ ఎన్నిక‌ల టైంలో నంద్యాల‌లో వైసీపీ పూర్తిగా డీలా ప‌డిపోయింది. అయితే రెండేళ్లకే సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డి త‌న‌యుడు శిల్పా ర‌విచంద్ర కిశోర్‌రెడ్డి రంగంలోకి దిగి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక‌, అప్పటి నుంచి త‌మ ప‌ట్టు పెంచుకునేందుకు నిత్యం ప్రజ‌ల్లోనే ఉంటున్నారు.

మూడు వర్గాలుగా విడిపోయి….

అదే స‌మ‌యంలో భూమా వ‌ర్గానికి అడ్డుక‌ట్ట వేసేలా వ్యవ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా యువ‌త‌ను వైసీపీలో చేర్చుకుని వారికి అన్ని ప‌నులు చేసి పెడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు భూమా బ్రహ్మానంద‌రెడ్డి, మాజీ మంత్రి అఖిల ప్రియ స‌హా ఎవ‌రూ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో హ‌వా చ‌లాయించే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్కడ ప‌ట్టున్న మాజీ మంత్రి ఫ‌రూక్‌ను సైతం అఖిల‌ప్రియ ప‌ట్టించుకోక‌పోవ‌డం, మ‌రో సీనియ‌ర్ నేత ఏవి.సుబ్బారెడ్డిని సైతం అఖిల‌ప్రియ లెక్కచేయ‌క‌పోవ‌డం, ఆయ‌న సైతం వేరుకుంప‌టి పెట్టుకోవడం… భూమా ఫ్యామిలీలో మూడు గ్రూపులు ఉండ‌డంతో నంద్యాల‌లో టీడీపీ దీన‌స్థితికి వెళ్లిపోయింది. రేపు ఇక్కడ జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల నేపథ్యంలో కూడా పార్టీ త‌ర‌పున జెండా మోసే స‌త్తా ఉన్న లీడ‌ర్లు క‌న‌ప‌డ‌డం లేదు. రెండున్నరేళ్ల క్రితం బాబు స‌త్తా చూపిన నంద్యాల‌లో ఇప్పుడు వైసీపీ జోరు ముందు ఆ పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేస్తోంది.

Tags:    

Similar News