పొగ‌డ్తలు లేవు.. ప‌నిత‌ప్ప.. అప్పుడే మంచి మార్కులు

అవును! ఇటీవ‌లే మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన డాక్టర్ సీదిరి అప్పల‌రాజు గురించి వైసీపీలో జోరుగానే చ‌ర్చ సాగుతోంది. యువ‌కుడు, విద్యావంతుడు.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన వెంట‌నే [more]

Update: 2020-10-30 12:30 GMT

అవును! ఇటీవ‌లే మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన డాక్టర్ సీదిరి అప్పల‌రాజు గురించి వైసీపీలో జోరుగానే చ‌ర్చ సాగుతోంది. యువ‌కుడు, విద్యావంతుడు.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన వెంట‌నే మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న నాయ‌కుడిగా.. గుర్తింపు పొందారు అప్పల‌రాజు. అయితే, ఆయ‌న‌కు మంత్రి ప‌దవి ఇవ్వడంపై అప్పట్లో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. జ‌గ‌న్ కేబినెట్‌లో నాలుగు నెల‌ల కిందట రెండు మంత్రి ప‌దవులు ఖాళీ అయ్యాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్‌.. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌లు రాజ్యస‌భ‌కు ప్రమోట్ కావ‌డంతో వీరి స్థానాల్లో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పల‌రాజుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

సీనియర్లు ఉన్నప్పటికీ…..

అయితే, వీరిక‌న్నా కూడా సీనియ‌ర్లు ఉన్నప్పటికీ.. సామాజిక వ‌ర్గాల వారీగా ప్రాధాన్యం ఇచ్చిన జ‌గ‌న్ వీరికి అవ‌కాశం క‌ల్పించారు. వాస్తవానికి మ‌త్స్యకార కోటాలో అప్పల‌రాజు క‌న్నా సీనియ‌ర్ అయిన ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్‌కుమార్ ఉన్నా కూడా జ‌గన్ అప్పల‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. దశాబ్దాల శ్రీకాకుళం రాజ‌కీయాల్లో వెల‌మ‌, కాళింగ‌, తూర్పు కాపులు మిన‌హా మ‌రో కులానికి చెందిన వ్యక్తి ఎప్పుడూ మంత్రి ప‌ద‌వి చేపట్టలేదు.

అనేక ప్రశ్నల మధ్య…..

అలాంటి జిల్లాలో అప్పల‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వడంతో జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఒక్కసారిగా మారిపోయాయి. సీదిరి అప్పల‌రాజు మంత్రి కావ‌డంపై జిల్లాలో ఓ వ్యాఖ్య వినిపించింది. జిల్లాలో రాజ‌కీయ మేధావులు, మోనార్కులు ఉన్నారు.. వారి మ‌ధ్యలో అప్పలరాజు ఏం చేస్తారు ? వారిని మెప్పించ‌డం.. జిల్లాకు పేరు తేవ‌డం సాధ్యమేనా ? అనే చ‌ర్చ జరిగింది. కులాల ఈక్వేష‌న్ల ప‌రంగా చూసినా కొప్పుల వెల‌మలు, కాళింగ‌లు, తూర్పు కాపు నేత‌ల రాజ‌కీయంలో మ‌త్స్యకార వ‌ర్గానికి చెందిన అప్పల‌రాజు త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం కూడా క‌ష్టమే అనుకున్నారు.

తనకు అప్పగించిన బాధ్యతలను…..

నిజానికి ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యే కావ‌డం, మంత్రి ప‌ద‌విని అందిపుచ్చుకోవ‌డం వంటివి గ‌మ‌నించిన త‌ర్వాత‌.. ఆయ‌న రాణించ‌డం సాధ్యమేనా ?అనే సందేహం మీడియా వ‌ర్గాల్లోనూ వినిపించింది. పైగా జ‌గ‌న్ ద‌గ్గర మార్కులు ప‌డ‌డం అంటే.. ఆయ‌న‌ను పొగ‌డాల‌నే కాన్సెప్ట్ ఉంద‌ని అంటారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు మీడియా ముందుకు వ‌చ్చినా.. జ‌గ‌న్‌పై స్త్రోత్రపాఠాలు అందుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా సీదిరి అప్పలరాజు కేవ‌లం నాలుగు నెల్లలోనే మంచి గుర్తింపు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ.. త‌న‌కు అప్పగించిన బాధ్యత‌ల‌ను నిర్వహిస్తున్నారు.

పాలనాపరంగా….

ఎక్కడా కూడా అతిగా జ‌గ‌న్‌పై పొగ‌డ్తలు విస‌ర‌డం లేదు. పైగా.. ఎక్కడా అదుపు త‌ప్పి.. వ్యహ‌రించ‌డం లేదు. ఏ మూలకైనా.. ఎక్కడికైనా.. వెళ్లిపోతున్నారు. పైగా సింపిల్‌సిటీ ని పాటిస్తున్నార‌న్న పేరు తెచ్చుకున్నారు. అధికార దుర్వినియోగం చేయ‌డం వంటివి లేనేలేవు. దీంతో అన‌తి కాలంలోనే ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయ‌ని ప్రచారం జ‌రుగుతోంది. అటు శాఖాప‌ర‌మైన మార్కుల‌తో పాటు ఇటు ప్రెస్‌మీట్లతో ప్రతిప‌క్షాన్ని విమ‌ర్శించ‌డం.. అటు నియోజ‌క‌వ‌ర్గమైన ప‌లాస‌తో పాటు జిల్లా రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. జ‌గ‌న్ సైతం అప్పల‌రాజు ప‌నితీరుపై ఇంట‌ర్నల్‌గా ప్రశంస‌లు కురిపిస్తున్నార‌ట‌.

Tags:    

Similar News