సిద్ధూ ప్లానింగ్ మామూలుగా లేదే….!!

టిక్కెట్ ఇవ్వకుంటే…ఆమె పార్టీ వీడుతారని తెలుసు….అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని తెలుసు. అయినా సిద్ధపడ్డారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య ఎత్తులకు జనతాదళ్ చిత్తవుతుందా? ఇదే చర్చ ఇప్పుడు [more]

Update: 2019-03-07 18:29 GMT

టిక్కెట్ ఇవ్వకుంటే…ఆమె పార్టీ వీడుతారని తెలుసు….అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని తెలుసు. అయినా సిద్ధపడ్డారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య ఎత్తులకు జనతాదళ్ చిత్తవుతుందా? ఇదే చర్చ ఇప్పుడు కన్నడనాట జరగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో వచ్చే లోక్ సభ ఎన్నికల కు వెళ్లాలని నిర్ణయించాయి. సీట్ల పంపకాలపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. బుధవారం మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలసి సీట్ల పంపంకపై చర్చలు జరుపుతున్నారు.

వ్యూహం ప్రకారమే….

కాని సిద్ధరామయ్య వ్యూహం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మాండ్య సీటు వాస్తవానికి అంబరీష్ సతీమణి సుమలత కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీటు కోసం సుమలత పట్టుబడుతున్నారు. అంబరీష్ కు మాండ్య నియోజకవర్గంలో పట్టు ఎక్కువ. అంతేకాకుండా ఆయన మరణంతో సుమలతకు సానుభూతి ఎక్కువగా ఉంది. ఆమె రెండు నెలలుగా మాండ్య నియోజకవర్గంలోనే పర్యటిస్తూ పోటీకి సిద్ధమయ్యారు. తాను కాంగ్రెస్ నుంచి పోటీచేస్తానని ఆమె అనేక సార్లుచెప్పారు. సిద్ధరామయ్యను కలసి కూడా తన మసనులో మాటను చెప్పారు.

పట్టుబట్టకుండా వదిలేసి….

కాని మాండ్య స్థానం జనతాదళ్ ఎస్ సిట్టింగ్ స్థానం. ఆ సీటు నుంచి దేవెగౌడ మనవడు, కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేయనునన్నట్లు ప్రకటించారు. కానీ ఈ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టు బట్టలేదు. కనీసం అంబరీష్ కు గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయింది. అది జేడీఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో దానికే వదిలేశామని సిద్ధరామయ్య చెప్పడం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవెగౌడ మనవడు నిఖిల్ ను దెబ్బకొట్టాలన్నదే సిద్దరామయ్య వ్యూహమంటున్నారు. మాండ్య టిక్కెట్ దక్కకపోతే సుమలత ఖచ్చితంగా బీజేపీలో చేరి పోటీ చేస్తారని అప్పుడు మాండ్య ను జనతాదళ్ ఎస్ కు దూరం చేయవచ్చన్న దురాలోచనతోనే సిద్ధరామయ్య మాండ్యను వదిలేసుకుంటున్నట్లు ప్రకటించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

మనవడిని ఓడించాలనేనా?

సిద్ధరామయ్య తొలుత జనతాదళ్ ఎస్ నేతగా ఎదిగిన వారే. ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు దేవెగౌడతో పొసగక బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ అభ్యర్థి చేతిలో చాముండేశ్వరినగర్ నుంచి ఓటమి పాలయ్యారు. తర్వాత అధిష్టానం సూచన మేరకు కాంగ్రెస్,జేడీఎస్ ల సంకీర్ణ సర్కార్ కు సిద్ధరామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గరనుంచి కుమారస్వామికి, సిద్ధరామయ్యకు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. దేవెగౌడ కూడా సిద్ధరామయ్యను పూర్తిగా నమ్మలేనిపరిస్థితి. ఈ పరిస్థితుల్లో మాండ్యలో సిద్ధరామయ్య ఒక వ్యూహం ప్రకారమే వ్యవహరించారని, గట్టిగా కోరి ఉంటే మాండ్య సీటు సుమలతకు దక్కేదన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. అయితే సుమలత భారతీయ జనతా పార్టీలో చేరి మాండ్య నుంచి పోటీ చేస్తే నిఖిల్ కు చుక్కలు కనపడటం ఖాయమనే చెప్పాలి. మాండ్య లో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కూడా సుమలత వైపే ఉండే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News