సిద్ధూ చేయాల్సిందంతా చేసి

సిద్ధరామయ్య చెప్పినట్లే జరిగింది. సిద్ధరామయ్య లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక కామెంట్ చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకుంటాయని సిద్ధరామయ్య [more]

Update: 2019-07-23 17:30 GMT

సిద్ధరామయ్య చెప్పినట్లే జరిగింది. సిద్ధరామయ్య లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక కామెంట్ చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకుంటాయని సిద్ధరామయ్య చేసిన కామెంట్ అప్పట్లో సంచలనమయింది. దీనిపై హైకమాండ్ కూడా దిగి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లోని సిద్ధరామయ్య వర్గం కుమారస్వామిని వన్ ఇయర్ సీఎం అంటూ ఎప్పటి నుంచో అనడం ప్రారంభిచారు. అవన్నీ ఇప్పుడు నిజమయ్యాయి.

అధికారంలోకి వద్దామనుకుని…..

సిద్ధరామయ్య… గత శాసనభ ఎన్నికల్లో తన వాగ్దాటితో, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి రావాలని అనుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సయితం ప్రచార బాధ్యతను సిద్ధరామయ్యకే అప్పగించారు. కానీ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనకబడింది. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీని గద్దె నెక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టాన అతి తక్కువ స్థానాలు వచ్చిన కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది.

కుమార ముఖ్యమంత్రి అయి….

జనతాదళ్ ఎస్ నుంచి వచ్చిన సిద్ధరామయ్యకు ఆ పార్టీ ముందు సాగిలపడటం తొలి నుంచి ఇష్టంలేదు. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. కానీ పార్టీ హైకమాండ్ ఆదేశాలను ఆయన తలవంచుకుని అమలు చేశారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కుమారస్వామితో పొసగడం లేదు. ఆయన తనకంటూ కాంగ్రెస్ లో ఒక వర్గం ఏర్పాటు చేసుకుని పరోక్షంగా కుమారస్వామిపై యుద్ధం ప్రకటించారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం….

ఇప్పుడు కుమారస్వామి కుప్పకూలిపోవడానికి కూడా సిద్ధరామయ్య ఒక కారణంగా చెప్పొచ్చు. పార్టీని వీడిన ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది సిద్ధరామయ్య వర్గం వారే కావడం గమనార్హం. తనపై దేవెగౌడ తరచూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయడం కూడా సిద్ధరామయ్య జీర్ణించుకోలేక పోయారంటారు. మొత్తం మీద కర్ణాటక సంక్షోభంలో సిద్ధరామయ్య పాత్ర లేదని చెప్పలేం. ఇప్పటి పరిస్థితికి ఒకరకంగా ఆయనే కారణమని చెప్పక తప్పదు.

Tags:    

Similar News