సిద్ధూను సాగనంపుతారా?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి పదవి ఇస్తారని తెలుస్తోంది. త్వరలో జరిగే పార్టీ నియామకాల్లో సిద్ధరామయ్యకు పదవి ఇవ్వడంపై రాష్ట్ర పార్టీలో [more]

Update: 2021-02-02 17:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి పదవి ఇస్తారని తెలుస్తోంది. త్వరలో జరిగే పార్టీ నియామకాల్లో సిద్ధరామయ్యకు పదవి ఇవ్వడంపై రాష్ట్ర పార్టీలో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల నాటికి సిద్ధరామయ్యను క్రమంగా జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ గా ఉంది. సిద్ధరామయ్యను ఈసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల నుంచి….

సిద్ధరామయ్య మళ్లీ ఇటీవల కాలంలో యాక్టివ్ అవుతున్నారు. శాసనసభ పక్ష నేతగా సిద్ధరామయ్య యడ్యూరప్ప సర్కార్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈలోగా సిద్ధరామయ్యను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించాలన్నది హైకమాండ్ ఆలోచనగా ఉంది. ఇందుకు ప్రధాన మిత్రపక్షమైన జేడీఎస్ కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ లో గ్రూపులు పెరగకుండా ఉండేందుకు సిద్ధరామయ్యను పక్కకు తప్పించాలన్న నిర్ణయానికి వచ్చారు.

ప్రభుత్వ పతనానికి….

తమకు అత్యధిక స్థానాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో కలసి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 14 నెలలు తిరగకుండానే సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. దీనికి కారణం సిద్ధరామయ్య అన్నది జేడీఎస్ ఆరోపణ. కాంగ్రెస్ నుంచి ఎక్కువగా బీజేపీలోకి వెళ్లింది సిద్ధరామయ్య అనుచరులే కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా గత కొంతకాలంగా ఆయనపై ఆగ్రహంగా ఉంది.

అందుకే తప్పించి….

దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను నియమించారు. ఇద్దరి మధ్య ప్రస్తుతానికి సమన్వయం ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఆధిపత్య పోరు ఉండే అవకాశముందని భావించిన హైకమాండ్ సిద్ధరామయ్యను గౌరవంగానే రాష్ట్ర రాజకీయాల నుంచి సాగనంపాలన్న యోచనలో హైకమాండ్ ఉంది. డీకే శివకుమార్ కు, కుమారస్వామికి మధ్య సత్సంబంధాలే ఉండటంతో తిరిగి జేడీఎస్ ను కలుపుకుని పోయే ప్రయత్నంలో భాగంగా సిద్ధరామయ్యకు చెక్ పెడతారంటున్నారు. మరి సిద్ధరామయ్య దీనికి అంగీకరిస్తారా? లేదా అన్నది చడాల్సి ఉంది.

Tags:    

Similar News