సిద్దప్పా… మరో దారి లేదు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో సిద్ధరాయ్యమ కాంగ్రెస్ శాసనసభ పక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేతలెవరూ తనకు సహకరించలేదని ఆయన ఆవేదన చెందారు. అందుకే [more]

Update: 2019-12-13 18:29 GMT

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో సిద్ధరాయ్యమ కాంగ్రెస్ శాసనసభ పక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేతలెవరూ తనకు సహకరించలేదని ఆయన ఆవేదన చెందారు. అందుకే తాను ఉప ఎన్నికల ఫలితాలకు తానే బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేశారు. నిజానికి కర్ణాటకలో సీనియర్ నేతలెవరూ సిద్ధరామయ్యకు సహకరించలేదనే చెప్పాలి. ఉప ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే తిరిగి అధికారంలోకి వస్తామని తెలిసినా సీనియర్ నేతలు పట్టించుకోలేదు.

ఓటమి చెందాలని….

పదిహేను నియోజకవర్గాల్లో నిజానికి పన్నెండింటిని కాంగ్రెస్ గెలుచుకుంటే బీజేపీ అధికారంలో ఉండేది కాదు. అయితే దీన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు ఈ ఉప ఎన్నికల్లో ఓటమి చెందాలనే ఎక్కువ మంది ఆశించారు. సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ సిద్ధరామయ్య దే పెత్తనం చేసేవారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యకు క్షేత్రస్థాయిలో పరిచయాలున్నాయి.

క్షేత్రస్థాయిలో…..

పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో? ఎక్కడ బలంగాఉందో? ఆయనకు తెలియంది కాదు. అయితే సంకీర్ణ సర్కార్ లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ నిందను సిద్ధరామయ్య భరించాల్సి వచ్చింది. అయితే సీరియస్ గానే సిద్ధరామయ్య ఈ ఉప ఎన్నికలను తీసుకున్నారు. అంతా తానే అయి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదు.

సీనియర్లు సహకరించకున్నా…..

సీనియర్ నేతలు పరమేశ్వర, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, మునియప్ప వంటి వాళ్లు సిద్ధరామయ్యకు సహకరించలేదు. అయినా ఆయన ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ ఓటమి పాలు కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య సేవలు పార్టీకి అవసరమని భావిస్తుంది. ఆయనను కేపీసీసీ అధ్యక్షుడుగా చేసే అవకాశముందంటున్నారు. సీఎల్పీ నేతగా ఆయన ఇష్టపడితే కొనసాగిస్తారని కూడా అంటున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య సేవలను వదులుకోరాదని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

Tags:    

Similar News