అందుకే తగ్గాడట

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజీనామాను వెనక్కు తీసుకునేది లేదని చెప్పేశారు. అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఆయన మనసు మారలేదు. తొలినాళ్లలో [more]

Update: 2019-12-21 18:29 GMT

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజీనామాను వెనక్కు తీసుకునేది లేదని చెప్పేశారు. అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఆయన మనసు మారలేదు. తొలినాళ్లలో సిద్ధరామయ్య రాజీనామాను ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే సిద్ధరామయ్య దూరదృష్టితో ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకే ఏఐసీసీ పరిశీలకుల సిద్ధరామయ్యను సీఎల్పీ పదవిలో కొనసాగాలని ఎంత బుజ్జగించినా వెనక్కు తగ్గలేదు. ఇందుకు కారణాలున్నాయంటున్నారు.

బీజేపీ బలంగా ఉండటం….

ప్రస్తుతం కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. మూడేళ్ల పాటు ప్రభుత్వానికి ఢోకాలేదు. ఈ సమయంలో సీఎల్పీ పదవి చేపట్టినా ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ లో తన అవసరాన్ని అందరూ గుర్తించాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. అందుకే అన్ని పదవులకూ దూరంగా ఉంటేనే తన విలువ తెలిసి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. పార్టీ నుంచి దూరం కాకపోయినా తనకు పార్టీపై ఉన్న గ్రిప్ ఏమాత్రం తొలగిపోదన్నది ఆయన విశ్వాసం.

ధైటైన నేత లేకపోవడం…..

దీంతోపాటు కర్ణాటక కాంగ్రెస్ లో బీజేపీని ఎదుర్కొనే ధీటైన నేత లేరు. డీకే శివకుమార్ ఉన్నప్పటికీ ఆయన కొన్ని ప్రాంతాలకే పరిమిత మవుతారు. ఈ మూడేళ్ల పాటు పీసీసీ, సీఎల్పీ పదవులు కొత్తవారికి ఇస్తే ఎవరి సత్తా ఏంటన్నది అటు అధిష్టానానికి, ఇటు పార్టీ నేతలకు తెలసి వస్తుందని సిద్ధారామయ్య భావిస్తున్నారు. తన నాయకత్వం లేకుండా పార్టీ పరుగులు తీస్తే మంచిదేనని బయటకు చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాదన్నది సిద్ధరామయ్యకు తెలియంది కాదు.

దూరంగా ఉంటేనే…..

అందుకే ఆయన సీఎల్పీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, మునియప్ప, హరిప్రసాద్ తదతర నేతలను టార్గెట్ గా చేసుకున్నారు. 2023 లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుతాయి. ఆ సమయానికి తిరిగి అధిష్టానం తనకు పగ్గాలు అప్పగిస్తుందని, అప్పటికే సీనియర్ల సత్తా ఏంటో హైకమాండ్ కు తెలిసి వస్తుందని సిద్ధరామయ్య భావిస్తున్నారు. తన నాయకత్వ లోటును తెలియజేయడానికే సిద్ధరామయ్య పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పార్టీలో విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News