కడిగిపారేస్తానంటూ…?

సిద్ధూ పైకి చెబుతున్నా లోలోపల మాత్రం అధిష్టానానికి గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. సిద్ధరామయ్య గతంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించినా సంకీర్ణ సర్కార్ కూలిపోయిన తర్వాత మాత్రం [more]

Update: 2019-10-08 17:30 GMT

సిద్ధూ పైకి చెబుతున్నా లోలోపల మాత్రం అధిష్టానానికి గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. సిద్ధరామయ్య గతంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించినా సంకీర్ణ సర్కార్ కూలిపోయిన తర్వాత మాత్రం జోరు పెంచారనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో తన అవసరం ఉందని ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు. సిద్ధరామయ్య లేని కాంగ్రెస్ ను కూడా ఇప్పట్లో ఊహించుకోలేమన్నది ఆయన మద్దతుదారుల అభిప్రాయం.

శానసభ సమావేశాలు…..

ఈనేపథ్యంలో అధిష్టానం తనకు ఏ పదవి ఇచ్చినా చేస్తానని, సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించారు. కర్ణాటక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్నాయి. అనేక సమస్యలు కర్ణాటకలో తిష్ట వేసి ఉన్నాయి. వరద సాయం కేంద్రం నుంచి అందలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కర్ణాటకపై సీతకన్ను వేసింది.

మంచి చేసుకోవడానికి….

ఈ శాసనసభ సమావేశాల్లో యడ్యూరప్పను కడిగిపారేసేందుకు సిద్ధరామయ్య లాంటి నేతలు అవసరమని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు. మరోవైపు సిద్ధరామయ్యపై అసంతృప్తి కూడా గట్టిగానే ఉంది. తనపై ఉన్న అసమ్మతిని తగ్గించుకునేందుకు సిద్ధరామయ్య తనకు ఏ పదవి ఇచ్చినా పరవాలేదని, అసలు ఇవ్వకపోయినా పార్టీ కోసం కార్యకర్తలా కృషి చేస్తానని చెబుతున్నారు. కానీ ఇవన్నీ పై పై మాటలేనన్నది అందరికీ తెలిసిందే.

పదవి లేకుండా…..

సిద్దరామయ్య పదవి లేకుండా ఉండలేరన్నది ఆయన సన్నిహితులు కూడా అంగీకరిస్తున్న నిజం. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న సీనియర్లకు చెక్ పెట్టాలంటే తనకు ఖచ్చితంగా పదవి దక్కాలన్నది ఆయన ఆలోచన. అందుకే అధిష్టానాన్ని మంచి చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మంది శానసభ్యులు తనకే మద్దతుగా ఉండటంతో తనకు శానసనభ పక్షనేత పదవి ఖాయమని సిద్ధరామయ్య భావిస్తున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News