ఎర్త్ పెడుతున్నారుగా

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలలు సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఉప ఎన్నికలకు ముందుగానే ఆయనను పక్కన పెట్టే కార్యక్రమం కాంగ్రెస్, జేడీఎస్ లు మొదలు పెట్టినట్లే [more]

Update: 2019-12-04 16:30 GMT

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలలు సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఉప ఎన్నికలకు ముందుగానే ఆయనను పక్కన పెట్టే కార్యక్రమం కాంగ్రెస్, జేడీఎస్ లు మొదలు పెట్టినట్లే కన్పిస్తుంది. కర్ణాటకలో జరుగుతున్న పదిహేను అసెంబ్లీ నియోజవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీని మూడు, నాలుగు సీట్లకు కట్టడి చేయగలిగితే మరోసారి జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ఏర్పడటం ఖాయం. ఉప ఎన్నికల్లో తమదే విజయం అన్న ధీమాతో కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే అధికారాన్ని చేపట్టడమెలా? అన్న దానిపైనే చర్చిస్తుండటం విశేషం.

కొన్నాళ్లు దూరమయినా…..

సంకీర్ణ సర్కార్ కుప్పకూలిపోయిన తొలినాళ్లలో జనతాదళ్ ఎస్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగింది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమంటూ జేడీఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామిలు సయితం ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రోద్బలంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్న విమర్శలు చేశారు. సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఉన్న సిద్ధరామయ్య ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలూ విన్పించాయి. అయితే ఉప ఎన్నికలు దగ్గరపడే సమయంలో తిరిగి జేడీఎస్, కాంగ్రెస్ లు ఒక్కటయ్యే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

బీజేపీకి దక్కకుంటే…..

ఉప ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది స్థానాలను బీజేపీ దక్కించుకోకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అప్పడు కాంగ్రెస్, జేడీఎస్ మరోసారి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసే అవకాశముంది. అయితే ఈసారి కాంగ్రెస్ కు సీఎం పదవి దక్కే అవకాశముంది. ఈ మేరకు జేడీఎస్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్రపడిన జేడీఎస్ కొంతకాలం ముఖ్యమైన పదవులకు తాము దూరంగా ఉండి పార్టీ నేతలకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. అయితే సిద్ధరామయ్యను కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే జేడీఎస్ సహకరించదు.

సిద్ధూకు నో ఛాన్స్…..

సిద్ధరామయ్య, దేవెగౌడల మధ్య దీర్ఘకాలంగా శతృత్వం ఉంది. అందుకోసమే దేవెగౌడ, కుమారస్వామి లు డీకే శివకుమార్ పేరును ప్రత్యేకంగా తెరపైకి తెస్తున్నారు. డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తే తమకు అభ్యంతరం లేదని సంకేతాలు కూడా పంపుతున్నారు. డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్య పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. వర్గాలను ప్రోత్సహించడం, తన వర్గం వారికే పదవులు ఇవ్వడం వంటి వాటితోనే కర్ణాటక సంకీర్ణ సర్కార్ కూలిపోయిందని డీకే కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు రోజు ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సిద్ధరామయ్యకు చెక్ పెట్టే పనిలో కాంగ్రెస్ త సహా, జేడీఎస్ నేతులున్నారు.

Tags:    

Similar News