విపక్షానికి డేంజర్ బెల్స్.. ఓట్ల షేర్ లో వైసీపీ?

ఏపీలో సర్వేల పర్వం ఇపుడు నడుస్తోంది. తాను చేపడుతున్న కార్యక్రమాల గురించి. తమ ప్రభుత్వం గురించి జగన్ ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్నారు. మరో వైపు తన పార్టీ [more]

Update: 2020-07-23 06:30 GMT

ఏపీలో సర్వేల పర్వం ఇపుడు నడుస్తోంది. తాను చేపడుతున్న కార్యక్రమాల గురించి. తమ ప్రభుత్వం గురించి జగన్ ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్నారు. మరో వైపు తన పార్టీ గ్రాఫ్ గురించి చంద్రబాబు కూడా సర్వేలనే నమ్ముకున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో జగన్ ఏడాది పాలన మీద టీడీపీ ఒక సర్వే చేయిస్తే షాకింగ్ విషయాలు వచ్చాయట. ఏపీలో టీడీపీ ఏ మాత్రం ఎత్తిగిల్లలేదని ఆ నివేదికలు చెప్పడంతో బాబులో ఒక్కసారిగా కంగారు పెరిగింది అంటున్నారు. ఇది టీడీపీ విషయం అయితే బీజేపీతో జత కట్టిన జనసేన తీరు కూడా అచ్చం అలాగే ఉందిట.

అయిదు శాతమా..?

ఈ మధ్య ఒక పాపులర్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. జగన్ కి దేశంలో నాలుగవ పాపులర్ సీఎంగా ఆ సర్వే తేల్చింది. ఆ సర్వేలో విషయాలు తీసుకుంటే టీడీపీ ఓట్ల శాతం 38 నుంచి బాగా తగ్గింది. ఇక బీజేపీ జనసేన ఓట్ల శాతం ఆరు శాతం మాత్రమేనని కూడా తేల్చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ తాజాగా నర్సాపురంలో ఒక సర్వే చేస్తే అక్కడ కూడా జనసేన, బీజేపీల ఓట్ల శాతం అయిదు లోపు ఉండడం విశేషం.

పెరిగేది లేదా….?

ఇక వైసీపీ ఓ వైపు గత ఎన్నికల ఓట్ల శాతం 50 నుంచి 55గా పెంచుకుందని ఒక పాపులర్ సర్వే చెబితే వైసీపీ సొంతగా చేసుకున్న సర్వేలో అది 58 శాతం అయింది. ఇక ఈ రెండు సర్వేల్లో కూడా జనసేన 6, 5 శాతం దగ్గరే నిల్చిపోవడం ఆశ్చర్యం కలిగించేదే. పవన్ని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ జనసేన ఉంటే, బీజేపీతో పొత్తు, మోడీ పొలిటికల్ గ్లామర్ కలసి రెండు పార్టీలకు మేలు జరుగుతుందని ఆశించారు. అందుకే పొత్తు పెట్టుకున్నారు కూడా. అలా పొత్తు పెట్టుకుని ఇప్పటికి ఏడు నెలలు గడచినా కూడా జనంపైన ఆ ప్రభావం ఏదీ లేదని తేలుతోంది.

మోడీకీ అంతేగా…?

ఎక్కడైనా రాజు గానీ ఏపీలో మాత్రం కాదన్నట్లుగా మోడీ పొలిటికల్ గ్లామర్ ఏపీకి వచ్చేసరికి చిత్తు అవుతోంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. పార్టీగా బీజేపీ జనాలకు బహు దూరంగా ఉంది. అదే విధంగా ఆ పార్టీలో విభిన్న భావజాలం కలిగిన నాయకులు కలసి కలగూర గంపను చేసి పారేశారు. మరో వైపు ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదన్న భావన జనంలో ఇప్పటికీ ఉంది. ప్రత్యేక హోదా మోడీ దృష్టిలో ముగిసిన అధ్యాయం అయితే కావచ్చు, కానీ ప్రజలు మాత్రం మరవలేదు, అలాగే ఏపీకి ఆర్ధిక ఇబ్బందులు, రాజధాని నిర్మాణం కాకపోవడం, అప్పులూ ఇవన్నీ కూడా బీజేపీ ప్రాప్తమేనని ప్రజలు భావిస్తున్నారు. దానితో పాటు పవన్ జనసేన కూడా నాడు పాచిపోయిన లడ్లూ అంటూ ప్యాకేజిని విమర్శించి ఇపుడు చేతులు కలపడాన్ని పక్కా రాజకీయంగానే జనం చూస్తున్నారు. అందుకే ఈ రెండు పార్టీల కలయిక ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదని తాజా సర్వేలు చెబుతున్నారు. ఇక్కడో చిత్రం ఏంటంటే టీడీపీ ఓటు షేర్ తగ్గుతూంటే అది మూడవ ఆల్టర్నేషన్ అని చెపుకునే బీజేపీ, జనసేనలకు కాకుండా వైసీపీకి మళ్ళడాన్ని బట్టి చూస్తూంటే విపక్షానికి ఏపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే విశ్లేషించాల్సిఉంటుంది.

Tags:    

Similar News