ప్యాకప్ కు రెడీ అయినట్లే

సరిగ్గా మరో వారం రోజుల్లో అమరావతిలో కార్యనిర్వాహక రాజధాని విశాఖ లో ఏర్పాటు అయిపోనుందా. అసెంబ్లీలో చర్చ, హైపవర్ కమిటీ, ఇతర కమిటీల పై చర్చ అంతా [more]

Update: 2020-01-13 06:30 GMT

సరిగ్గా మరో వారం రోజుల్లో అమరావతిలో కార్యనిర్వాహక రాజధాని విశాఖ లో ఏర్పాటు అయిపోనుందా. అసెంబ్లీలో చర్చ, హైపవర్ కమిటీ, ఇతర కమిటీల పై చర్చ అంతా పైకి మాత్రమేనా. ఇప్పటికే సెక్రెటేరియట్ తరలింపునకు సంబంధించి అంతా మూటా ముల్లె సర్దుకుని రెడీ గా ఉన్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అయితే అధికారికంగా మాత్రం ఇదేమీ చెప్పడం లేదు కానీ జరగాలిసిన పనులన్నీ చకచకా సాగిపోతున్నట్లు రాజధాని వర్గాల టాక్.

శాఖాధిపతులకు ఆదేశాలు …

అన్ని ప్రధాన శాఖల అధిపతులు తమ కార్యాలయాల తరలింపు కి సిద్ధంగా ఉండాలన్న ఆదేశాలతో కీలక ఉద్యోగుల సెలవులు రద్దు అయినట్లు తెలుస్తుంది. దాంతో సచివాలయంలో ఫైల్స్ అన్ని ప్యాక్ అయిపోతున్నాయని చెబుతున్నారు. కీలకమైన పనులకోసం వెళ్లేవారికి విశాఖలో కలవాలని ఆయా ఫైల్స్ ప్యాకింగ్ లో ఉన్నట్లు చెప్పడంతో పలువురు జగన్ సర్కార్ జోరుకి షాక్ అవుతున్నారు. అమరావతిలో ఒక పక్క గట్టి ఉద్యమం నడుస్తున్న తరుణంలో మౌఖిక ఆదేశాలతోనే జరగాలిసిన తతంగాన్ని జరిపిస్తున్నారని చెబుతున్నారు. ఈనెల 20 తరువాత రాజధాని తరలింపు ప్రక్రియ రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.

అంతా బాబు స్టయిల్ లోనే….

ఏపీ నూతన రాజధాని అంశంలో చంద్రబాబు ఇలాగే గందరగోళం నడుమ అమరావతిని ఎంపిక చేసి తాను అనుకున్నదే చేసి పాడేశారు. సరిగ్గా అలాగే ముఖ్యమంత్రి జగన్ సైతం తనదైన స్టయిల్ లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి అమరావతి జేఏసీ కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. పరిపాలన భవనాలకు విశాఖలోని ఐటి విస్తరణకు ఏర్పాటు చేసిన మిలీనియం టవర్స్ ను ఎంపిక చేశారని అయితే దీనికి కొన్ని సమస్యలు సాంకేతికంగా ఎదురు కావడంతో ప్రత్యేక జీవో ద్వారా వాటిని అధిగమించి కొత్త రాజధానిని విశాఖ సిగలో సింగారించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.

నిబంధనలు అడ్డు రావడంతో….

ఐటీయేతర కార్యకలాపాలకు మిలీనియం టవర్స్ వంటివి వినియోగించరాదన్న ఎస్ ఈ జెడ్ నిబంధనలు ప్రతిబంధకంగా ఉండటంతో వాటిని మార్చి తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ ఏమన్నట్లు జగన్ సర్కార్ చకచకా తాము అనుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే ముందుకు పోతుండటంతో విపక్షాల ఉద్యమం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది.

Tags:    

Similar News