వాళ్ల గ్రిప్ లో నుంచి బయటపడితేనే?

తెలుగుదేశం పార్టీలో సీనియర్లే గుదిబండలుగా మారారు. వీరు పార్టీకి ఏమాత్రం ఉపయోగపడకపోగా తమ నియోజకవర్గాల్లో సయతం పట్టు కోల్పోతున్నారు. దీంతో వీరికి చంద్రబాబు చెక్ పెట్టాలన్న డిమాండ్ [more]

Update: 2021-03-29 09:30 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్లే గుదిబండలుగా మారారు. వీరు పార్టీకి ఏమాత్రం ఉపయోగపడకపోగా తమ నియోజకవర్గాల్లో సయతం పట్టు కోల్పోతున్నారు. దీంతో వీరికి చంద్రబాబు చెక్ పెట్టాలన్న డిమాండ్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. ప్రతి జిల్లాలోనూ సీనియర్ల హవానే నేటికీ కొనసాగుతుంది. చంద్రబాబు కు సన్నిహితంగా ఉండేవారు కావడం, ఆయనతో రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో జిల్లాల్లో ఇప్పటికీ వారి మాటే చెల్లుబాటు అవుతుంది.

కొత్త నాయకత్వం ఎదుగుదలకు….

కొత్త నాయకత్వం ఎదుగుదలకు సీనియర్లు అడ్డంకిగా మారారు. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. యువనేతలు జెండా పట్టుకుని ముందుకు వస్తున్నా వారిని ప్రోత్సహించే వారు లేరు. ఇక పదవులు అందుకునే సరికి సీనియర్లకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో తాము జెండా పట్టుకుని ప్రయోజనం ఏంటన్న చర్చ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో బయలుదేరింది. నిజానికి ఆర్థికంగా, సామాజికపరంగా తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలే ఉన్నారు.

వారిదే ఆధిపత్యం…..

కానీ సీనియర్ల ముందు వీరు నెగ్గుకు రాలేకపోతున్నారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ల హవానే నేటికీ నడుస్తుంది. పదవులు వచ్చినా వారికే. వారిద్దరూ జిల్లా తెలుగుదేశంపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇక్కడ కొత్త తరం నాయకత్వం ఎదగలేకపోతుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ సీనియర్లిద్దరి నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.

చెక్ పెట్టగలిగితేనే?

ఇక అనంతపురం జిల్లాలోనూ కాల్వ శ్రీనివాసులు, పరిటాల కుటుంబం వంటి వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కర్నూలు జిల్లాలోనూ కోట్ల, కేఈ కుటుంబాలు పార్టీని తమ గ్రిప్ లో పెట్టుకున్నాయి. ఇలా సీనియర్ నేతల గుప్పిట్లో నుంచి జిల్లాలను బయటపడేయాలని చంద్రబాబును యువనాయకత్వం కోరుతుంది. అప్పుడే తెలుగుదేశం పార్టీకి భవిష‌్యత్ ఉంటుందని చెబుతుంది. మరి చంద్రబాబు సీనియర్ నేతలను పక్కన పెట్టే ధైర్యం చేయగలరా? అన్నదే ప్రశ్న. సీనియర్లతోనే చంద్రబాబు పార్టీని నడిపితే ఫలితాల్లో ఏ మాత్రం మార్పు ఉండదన్నది కాదనలేని వాస్తవం.

Tags:    

Similar News