వీరికిక రాజకీయ భవిష్యత్ లేనేలేదట…?

రాష్ట్రంలో రాజ‌కీయ ట‌పాసులుగా పేరున్న అనేక మంది నాయ‌కులు మూల‌న‌బడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోలేని కొంద‌రు.. వ‌యో వృద్ధులు కావ‌డంతో మ‌రికొంద‌రు.. తాము [more]

Update: 2020-11-22 00:30 GMT

రాష్ట్రంలో రాజ‌కీయ ట‌పాసులుగా పేరున్న అనేక మంది నాయ‌కులు మూల‌న‌బడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోలేని కొంద‌రు.. వ‌యో వృద్ధులు కావ‌డంతో మ‌రికొంద‌రు.. తాము సంపాయించుకున్న ఇమేజ్‌కు భిన్నమైన రాజ‌కీయాలు చేయ‌లేక మ‌రికొంద‌రు .. ఇలా అనేక కార‌ణాల‌తో చాలా మంది నాయ‌కులు ఇప్పుడు గ‌డ‌ప కూడా దాట‌టం లేదు. ఒక‌ప్పుడు రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు.. త‌మ మాట‌తో నియోజ‌క‌వ‌ర్గాల‌ను, పార్టీల‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడించిన నేత‌లు.. ప్రజ‌ల మ‌దిలో గూడుక‌ట్టుకున్న మంచి నాయ‌కులుగా పేరు తెచ్చుకున్న నేత‌లు కూడా ఇప్పుడు మూల‌న‌ప‌డ్డ మ‌తాబుల మాదిరిగా త‌యార‌య్యారు. వీరి వార‌సులు కూడా అదే ప‌రిస్థితి ఎదుర్కొన‌డం… కొంద‌రికి వార‌సులే లేక‌పోవ‌డం ఈ రాజ‌కీయ ట‌పాసుల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఈ జాబితాలో కొంద‌రి గురించి చ‌ర్చించుకుందాం.

కావూరి సాంబశివరావు:

‌మైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మూడున్నర ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగారు. కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేసిన కావూరి కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల నుంచి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో బీజేపీలో చేరినా.. త‌ర్వాత క‌నుమ‌రుగై పోయారు. బ్యాంకులు, రుణాల ఎగ‌వేత‌లో ఆయ‌న వివాదానికి గుర‌య్యారు. ఆయ‌న‌కు వార‌సులు లేక‌పోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయానికి దాదాపు తెర‌ప‌డిన‌ట్టే.

రాయపాటి సాంబశివరావు:

క‌ప్పుడు గుంటూరు జిల్లా రాజ‌కీయాలంటే.. రాయ‌పాటి .. అనే పేరుంది. కానీ ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఊసు కూడా వినిపించ‌డం లేదు. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో యువ నాయ‌కుడు లావుపై ఓట‌మి పాల‌య్యారు. రాయ‌పాటి వార‌సుడు రంగారావు టీడీపీలో క్రియాశీల‌కంగా ఉన్నా ఆయ‌న కోరుకున్న స్థాయికి ఇంకా వెళ్లలేదు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి:

ల్లూరుకు చెందిన మేక‌పాటి.. ఎంపీగా కాంగ్రెస్‌లోను, త‌ర్వాత వైసీపీలోనూ గుర్తింపు పొందారు. హుందా రాజకీయాల‌కు ఈయ‌న పెట్టింది పేరు. త‌న కుమారుడు, సోద‌రుడు కూడా రాజ‌కీయాల్లో గుర్తింపు సాధించ‌డం వెనుక మేక‌పాటి ముందంజ‌లో ఉన్నారు. అయితే.. అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, రాజ‌కీయంగా ఆయ‌న శ‌కం ముగిసినా.. కుమారుడు గౌతం రెడ్డి బాగానే దూసుకుపోతుండ‌డం రికార్డు.

బైరెడ్డి రాజశేఖరరెడ్డి:

ప్రత్యేక రాయ‌లసీమ ఉద్యమంతో తెర‌మీద‌కి వ‌చ్చిన బైరెడ్డి క‌ర్నూలులో ప్రత్యేక పార్టీ కూడా పెట్టుకున్నారు. అయితే, విఫ‌ల‌మైన నాయకుడిగా ఆయ‌న మిగిలిపోయారు. త‌న కుమార్తెను వార‌సురాలిగా ప్రక‌టించినా..పుంజుకోలేని ప‌రిస్థితి. ఇప్పుడు వీరి ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంది.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి :

‌ర్నూలుకు జిల్లాలో కొన్ని ద‌శాబ్దాలు పాటు చ‌క్రంతి ప్పిన కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి వార‌సుడిగా రంగంలోకి దిగిన ఈయ‌న కాంగ్రెస్‌లో మంచి పేరుసంపాయించుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే టీడీపీలోకి వ‌చ్చినా గ‌త ఎన్నిక‌ల్లో కోట్ల ఎంపీగాను, భార్య సుజాత‌మ్మ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు స‌త్తా చాట‌లేక గ‌డ‌ప‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఏదైనా సంచ‌ల‌నం జ‌రిగి కోట్ల వార‌సుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తే మిన‌హా కోట్ల ఫ్యామిలీ దాదాపు రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌ట్టే.

జేసీ ప్రభాక‌ర్‌ రెడ్డి:

నంత‌లో త‌న‌కు తిరుగులేని రాజ‌కీయాలు చేసిన 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. నేటి త‌రం రాజ‌కీయాల‌తో కుస్తీ ప‌ట్టలేక పోతున్నారు. కుమారుడుని రంగంలోకి దింపినా.. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి.. అన‌నుకూల ప్రభుత్వంతో ఎదురీత వంటివి వీరి రాజ‌కీయాల‌కు ప్రతిబంధకంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై స‌వాల‌క్ష ఆశ‌లు ఉన్నా.. ఫ‌లితం ఎలా ఉంటుందోన‌న్నది ప్రశ్నార్థక‌మే.

పనబాక లక్ష్మీ:

గ్రెస్‌లో ఉండ‌గా ఓ వెలుగు వెలిగిన నాయ‌కురాలు.. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో కేంద్ర మంత్రి ప‌ద‌వి పొందిన ఏపీకి చెందిన మ‌హిళ‌ల్లో తొలి నాయ‌కురాలు కూడా ఈమె. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీలోకి చేర‌డం.. తిరుప‌తి నుంచి ఓట‌మి పాల‌వ‌డం.. ప్రజాద‌ర‌ణ‌ను చూర‌గొన‌లేక‌పోవ‌డం మైన‌స్‌లుగా మారి.. భ‌విష్యత్తుపై బెంగ‌పెట్టుకున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పుంజుకోవ‌డం క‌ష్టమేన‌న్నది ప‌రిశీల‌కుల మాట‌.

Tags:    

Similar News