మంత్రిగారి అణగదొక్కుడు రాజకీయం.. బర్నింగ్ టాపిక్

వైసీపీలో అంతా యువ రాజ్యం రాజ్యమేలుతోంద‌ని పైకి క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ కూడా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని కూడా ఆయ‌న [more]

Update: 2020-10-02 05:00 GMT

వైసీపీలో అంతా యువ రాజ్యం రాజ్యమేలుతోంద‌ని పైకి క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ కూడా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని కూడా ఆయ‌న నిర్ణయించుకు న్నారు. 50 ఏళ్లలోపు వారికే గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా టికెట్లు ఇచ్చి.. గెలిపించుకున్నారు కూడా.ఇక‌, ఇప్పుడు టీడీపీ నుంచి కూడా వ‌చ్చే వారిలో యువ‌త‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజ‌ల్లో వీరికి క్రేజ్ ఎక్కువ‌గా ఉండ‌డం, పార్టీ త‌ర‌ఫున క‌ష్టప‌డి ప‌నిచేస్తార‌ని భావిస్తుండ‌డంతో యువ‌త‌కే మున్ముందు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇవ్వాల‌నేది పార్టీ నియమంగా పెట్టుకున్నారు.

సీనియర్ మంత్రి మాత్రం…..

మ‌రి పార్టీనే యువ‌త వైపు మొగ్గు చూపుతుంటే.. మంత్రులుగా, కీల‌క స్థానాల్లో ఉన్నవారు, సీనియ‌ర్లు కూడా యువ‌త‌ను ప్రోత్సహిస్తార‌ని అంద‌రూ ఆశిస్తారు. కానీ, ఎవ‌రు ఎలా ఉన్నారో తెలియ‌డం లేదుకానీ, చిత్తూరుకు చెందిన ఓ సీనియ‌ర్ మంత్రి గారు మాత్రం యువ‌త‌ను త‌న ద‌గ్గర‌కు కూడా రానివ్వడం లేద‌నే ప్రచారం జ‌రుగుతోంది. యువ నేత‌ల‌కు ఏం తెలుసు..! అనే వ్యాఖ్యలు కూడా ఆయ‌న చేస్తున్నార‌ని పార్టీలో చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

వారిని దూరంగా ఉంచి…..

రెండు రోజుల పాటు సీఎం జగన్ తిరుమ‌ల‌లో బ‌స చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయ‌న ఒక రాత్రంతా తిరుమ‌ల‌లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ వ్యవ‌హారాల‌పైనా ఆయ‌న దృష్టిపెట్టారు. ఈ క్రమంలో పార్టీ సాధ‌క బాధ‌లు చెప్పుకొనేందుకు యువ నాయ‌కులు, ఎమ్మెల్యేలు ప్రయ‌త్నించారు. అయితే… స‌ద‌రు మంత్రి మాత్రం వారిని సీఎం ప‌ర్యట‌న‌కు దూరంగా ఉంచార‌ని జిల్లాలో టాక్ న‌డుస్తోంది. ప‌ల‌మ‌నేరు, శ్రీకాళ‌హ‌స్తి.. త‌దిత‌ర ఓ ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ ఎమ్మెల్యేలు గెలుపు గుర్రం ఎక్కారు.

తొలిసారి అసెంబ్లీకి వచ్చి…..

వారు తొలిసారి అసెంబ్లీలోనే అడుగు పెట్టినా.. పార్టీకి కీల‌కంగా ఉన్నారు. వీరంతా .. జ‌గ‌న్‌కు అత్యంత ఆప‌ద్భాంధ‌వులు . అయితే, వీరిని స‌ద‌రు మంత్రిగారు సీఎం ప‌ర్యట‌న‌లో పాల్గొన‌వ‌ద్దు. అంతా బిజీగా ఉంటుంది. అని మౌఖిక ఆదేశాలు జారీ చేశార‌ని, దీంతో వారంతా దిగువ తిరుప‌తిలోనే ఉండిపోయార‌ని, సీఎంను క‌లిసే అవ‌కాశం రాలేద‌ని చ‌ర్చన‌డుస్తోంది. మ‌రి ఇలా అయితే.. మున్ముందు యువ‌త‌కు ప్రాధాన్యం ద‌క్కేనా ? అన్న చ‌ర్చలు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక స‌ద‌రు మంత్రి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వేలు పెట్టి యువ ఎమ్మెల్యేల‌ను ఇబ్బంది పెడుతోన్న నేప‌థ్యంతో వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఆయ‌న తీరు మార‌లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న క‌నీసం జిల్లా ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన సీఎంను కూడా ఎమ్మెల్యేలు క‌ల‌వ‌కుండా చేశారంటే ఆయ‌న అణ‌గ‌దొక్కడు రాజ‌కీయం ఎలా ఉందో అర్థమ‌వుతోంది.

Tags:    

Similar News