Tdp : మరో ఇద్దరు సీనియర్లు పోటీకి దూరం?

తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. వరసగా నేతలు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. పార్టీపై విశ్వాసం క్రమంగా సన్నగిల్లడంతో పాటు వైసీపీ స్పీడ్ పెంచడంతో కొందరు రాజకీయాల [more]

Update: 2021-09-27 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. వరసగా నేతలు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. పార్టీపై విశ్వాసం క్రమంగా సన్నగిల్లడంతో పాటు వైసీపీ స్పీడ్ పెంచడంతో కొందరు రాజకీయాల నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు. తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చంద్రబాబుకు చెబుతున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చంద్రబాబు చెప్పడంతో మరికొందరు నేతలు కూడా పోటీకి దూరమవుతున్నారు. ఇప్పటికే రాయపాటి సాంబశివరావు సయితం తాను పోటీకి దూరమని ప్రకటించారు. తన కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు.

తన భార్య మాత్రం….

ఇక తాజాగా రాయలసీమలోని ముఖ్యనేతలు కొందరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఒకరు. వయసు పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తడంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. తన సతీమణి కోట్ల సుజాతమ్మ మాత్రం ఆలూరులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, తాను మాత్రం పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు తక్కువని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

మరోసారి ఓటమిని….

కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మంట్లలో వైసీపీ బలంగా ఉంది. ఒక్క కర్నూలు టౌన్ నియోజకవర్గంలో తప్ప టీడీపీ ఎక్కడా బలంగా లేదు. ఇప్పటికే రెండు సార్లు నుంచి కోట్లసూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ పరాభావాన్ని మూటకట్టుకోవడానికి సిద్ధంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఎంపీ కూడా ఇదే స్టాండ్ ను తీసుకున్నట్లు తెలిసింది.

కిష్టప్ప కూడా….

హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం మాజీ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సయితం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. త్వరలో చంద్రబాబు దృష్టికి తేనున్నారు. పుట్టపర్తి, పెనుకొండ అసెంబ్లీల నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ పార్టీ అధినాయకత్వం బీకే పార్థసారధికి పగ్గాలు ఇవ్వడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే గత కొన్నాళ్లుగా నిమ్మల కిష్టప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద మరో ఇద్దరు సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది

Tags:    

Similar News