తట్టుకోవడం కష్టమేనట

జగన్ ను తట్టుకోవడం కష్టమే. జగన్ ఎత్తుగడలు, వ్యూహాలు భవిష్యత్తులో మరింత వేడిగా ఉంటాయి. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ నేతలు. ఐదేళ్లు [more]

Update: 2019-08-10 03:30 GMT

జగన్ ను తట్టుకోవడం కష్టమే. జగన్ ఎత్తుగడలు, వ్యూహాలు భవిష్యత్తులో మరింత వేడిగా ఉంటాయి. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ నేతలు. ఐదేళ్లు ఆంద్రప్రదేశ్ లో పార్టీని నడపటం కష్టమేనంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు. ఇందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. చంద్రబాబునాయుడు ఎంత కష్టపడినా ఈసారి కూడా జగన్ ధాటికి నిలవలేమంటున్నారు టీడీపీ నేతలు. ఇది చంద్రబాబునాయుడు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్న అంశమే.

బిజినెస్ మ్యాన్ గా…..

జగన్ ఫక్తు వ్యాపార వేత్త. ఆయన రాజకీయాల కంటే ముందు బిజినెస్ లో దిగారు. వ్యాపారాల్లో జగన్ రాణించారని చెబుతారు. వివిధ వ్యాపారాల్లో జగన్ అనుసరించిన విధానంతో వాటిని లాభాల బాట పట్టించారంటారు. తొమ్మిదేళ్లుగా జగన్ వ్యాపారాల గురించి పట్టించుకోకపోయినా వాటికి బలమైన పునాదులు వేసింది జగన్ మాత్రమే. వ్యాపారాలను లాభాల్లోకి తెచ్చినట్లుగానే రాజకీయాల్లోనూ రాణిస్తారని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.

పొలిటికల్ టెక్నిక్ లు….

బిజినెస్ టెక్నిక్ లు తెలిసినట్లుగానే, రాజకీయాల్లో రాణించడానికి జగన్ వద్ద అస్త్ర శస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన కన్పిస్తుంది. చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా రాజకీయ వ్యూహాలను అనుసరించలేకపోతున్నారు. ఆయన చేసిన తప్పులతో జనంతో పాటు పార్టీలు కూడా నమ్మడం లేదు. ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలయిన చంద్రబాబుతో జత కట్టడానికి భవిష్యత్తులో నూ ఎవరూ ముందుకు రారన్నది జగన్ పార్టీ నేతల నమ్మకం. టీడీపీ నేతల అనుమానం కూడా ఇదే.

సైడయి పోవాలని….

అందుకే జగన్ తో పెట్టుకోవడం కన్నా మౌనంగా సైడయి పోవడం మేలని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సైలంట్ అయ్యారంటున్నారు. ఇప్పటికే టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే కార్యక్రమాన్ని జగన్ మొదలు పెట్టారంటున్నారు. ఇసుక ను నిలిపేయడం, టీడీపీ హయాంలో ఎన్నికలకు ముందు తీసుకున్న కాంట్రాక్టులను నిలిపేయడంతో చాలా మందినేతలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత పట్టు బిగించేందుకు జగన్ సిద్ధమవుతుండటంతో జగన కన్ను గీటితే పార్టీలోకి జంప్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం మీద టీడీపీ నేతల్లో జగన్ అంటే కొంత భయం మాత్రం కనపడుతుంది. అయితే జనం తిరగబడితే మాత్రం ఎంతటి నేతకైనా ఓటమి తప్పదని, అందుకు చంద్రబాబు నిదర్శనమని, జగన్ కూడా అతీతుడు కాడని కొందరు నేతలు అంటున్నారు.

Tags:    

Similar News