వైసీపీలో ఈ నేత‌ల క‌ష్టాలు.. క‌న్నీళ్లకు అంతే లేదా..?

వైసీపీలో సీనియ‌ర్ల ఆవేద‌న‌కు అంతే లేదా ? పార్టీ నుంచి గ‌త ఏడాది గెలిచిన వారిలో ఓ 50 మంది వ‌ర‌కు త‌మ బాధ‌, గోడును ఎవ‌రికి [more]

Update: 2020-08-17 13:30 GMT

వైసీపీలో సీనియ‌ర్ల ఆవేద‌న‌కు అంతే లేదా ? పార్టీ నుంచి గ‌త ఏడాది గెలిచిన వారిలో ఓ 50 మంది వ‌ర‌కు త‌మ బాధ‌, గోడును ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. లోలోన ఆందోళ‌న చెందుతున్నారు. అంటే వైసీపీలో వాతావ‌ర‌ణం చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. పార్టీ నుంచి గెలిచిన వారిలో ధ‌ర్మాన ప్రసాద‌రావు, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, న‌ల్లపురెడ్డి ప్రస‌న్నకుమార్ రెడ్డి, శెట్టిప‌ల్లి ర‌ఘురామ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి, కాకాణి గోవ‌ర్థన్ రెడ్డితో పాటు క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. వీరిలో మంత్రి ప‌ద‌వులతో మొద‌లు పెడితే ఇత‌ర‌త్రా నామినేటెడ్ ప‌ద‌వులు ఆశించే వారి వ‌ర‌కు చాలా మందే ఉన్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో సీటు త్యాగం చేసిన వారిలో కిల్లి కృపారాణి లాంటి వారు సైతం ఉన్నారు.

డైరెక్ట్ గానో.. ఇన్ డైరెక్ట్ గానో…

వీరిలో జ‌గ‌న్ డైరెక్టుగానో లేదా బ‌హిరంగంగానో ఏదో ఒక ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన వారు సైతం ఉన్నారు. అయితే ఇప్పుడు వీరెవ్వరిని జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో తీవ్ర ఆవేద‌న‌తో పాటు మ‌నోవేదన‌లో ఉన్న నేత‌లు ఎంతో మంది ఉన్నారు. ఇక వీరి క‌ష్టాల‌కు తోడన్నట్టు క‌రోనా రావ‌డంతో జ‌గ‌న్ క‌రోనాను బూచీగా చూపించి ఆ చూద్దాంలే అన్న దాట‌వేత ధోర‌ణితో వెళుతున్నారు. దీంతో సీనియ‌ర్ నేత‌లు ప‌ద‌వులు లేక‌.. ప‌నులు కాక‌.. అటు ప్రయార్టీ లేక క‌క్కలేక‌.. మింగ‌లేక అన్నట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. ప‌ద‌వులు లేని వారు రెండు, మూడు ప‌ద‌వులు ఉన్న వారిని చూపించి మ‌రీ త‌మ‌లో తామే ప్రశ్నించుకుంటోన్న ప‌రిస్థితి.

వారికి మాత్రం…..

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డికి.. రెండు నామినేటెడ్ ప‌ద‌వులు క‌ట్టబెట్టారు. ఇక అదే జిల్లాలో న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సైతం ఉన్న ఎమ్మెల్యే ప‌ద‌వికి తోడు మ‌రో నామినేటెడ్ ప‌ద‌వి క‌ట్టబెట్టారు. ఇదే ఇప్పుడు సీనియ‌ర్లు ర‌గిలిపోవ‌డానికి కార‌ణ‌మైంది. సీనియ‌ర్లుగా ఉన్న త‌మ‌కు ఏ ప‌ద‌వులు లేవ‌ని.. త‌మ‌కంటే జూనియ‌ర్లకు అందులోనూ చెవిరెడ్డి లాంటి వారికి రెండు, మూడు ప‌ద‌వులు క‌ట్టబెట్టడాన్ని వీరు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ధ‌ర్మాన ప్రసాద‌రావు అయితే క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వికి కూడా తాను స‌రిపోనా ? అని త‌న స‌న్నిహితుల వ‌ద్ద తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నార‌ట‌. ఆయ‌న జిల్లా రాజ‌కీయాల్లో కాదు క‌దా క‌నీసం త‌న నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

ఉత్తరాంధ్ర నేతల్లో….

ఇక 2014లో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి శాంతి ఆ ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి భారీగా ఖ‌ర్చు పెట్టారు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో ఆమె పాత‌ప‌ట్నం ఎమ్మెల్యేగా గెలిచి నామినేటెడ్ ప‌ద‌వి రేసులో ఉన్నా జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఇక అదే జిల్లాలో పాల‌కొండ నుంచి రెండోసారి గెలిచిన విశ్వన‌రాయ క‌ళావ‌తి కూడా నామినేటెడ్ ప‌ద‌వి లేద‌ని అంటీముట్టన‌ట్టుగా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నార‌ట‌. ఇక శ్రీకాకుళం జిల్లా పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న కిల్లి కృపారాణిది మ‌రో వేద‌న‌. ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందు శ్రీకాకుళం ఎంపీ లేదా టెక్కలి సీటు ఆశించారు. జ‌గ‌న్ ఆ రెండు సీట్లు ఇవ్వకుండా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏదో ఒక నామినేటేడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. ఇప్పుడు టెక్కలి అసెంబ్లీ, శ్రీకాకుళం ఎంపీ సీట్లలో పార్టీ ఓడింద‌న్న సాకుతో ఆమెను ప‌క్కన పెట్టేశార‌ట‌.

నెల్లూరు జిల్లాలో…..

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత ఆనం రామనారాయ‌ణ రెడ్డి ఏకంగా మంత్రి ప‌ద‌వి ఆశించారు. వాస్తవానికి ఆయ‌న టీడీపీ పాల‌న‌లోనే మంత్రి ప‌ద‌వి రాలేద‌ని కోపంతో వైసీపీకి వ‌చ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయ‌న మాట అధికారులే వినే ప‌రిస్థితి లేద‌న్న ఆవేద‌న ఆయ‌న‌ది. అదే జిల్లాలో కోటంరెడ్డి, కాకాణి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డితో పాటు కిలివేటి సంజీవ‌య్య ఆవేద‌న కూడా అలాగే ఉంది. ఇక క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల్లో ఓ 10 మంది వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వులు లేక‌… అడిగిన నిధులు లేక.. బాధ‌ను క‌క్కలేక‌.. మింగ‌లేక అన్నట్టుగా ఉన్నారు.

Tags:    

Similar News