టీడీపీలో ఆ కుటుంబాలు సైలెంట్‌.. ప‌ట్టించుకోని బాబు

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో కీలక‌మైన సీనియ‌ర్లు ఉన్నారు. ద‌శాబ్దాలుగా పార్టీలో ఎన్నో కీల‌క‌ ప‌ద‌వులు అనుభ‌వించిన వారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పిన వారు, ఇప్పుడు కూడా [more]

Update: 2020-12-19 11:00 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో కీలక‌మైన సీనియ‌ర్లు ఉన్నారు. ద‌శాబ్దాలుగా పార్టీలో ఎన్నో కీల‌క‌ ప‌ద‌వులు అనుభ‌వించిన వారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పిన వారు, ఇప్పుడు కూడా ప‌ద‌వుల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వీరిలో య‌న‌మ‌ల‌, మాగంటి, కేఈ, బొజ్జల‌, ప‌రిటాల‌, గాలి, చిక్కాల‌, ప‌య్యావుల, కింజ‌రాపు, కోడెల‌, గ‌ద్దె ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కుటుంబాల్లో ఎన్ని పార్టీకి ప్రయోజ‌నంగా వ్యవ‌హ‌రిస్తున్నా యి? ఎంత మంది పార్టీ కోసం బ‌య‌ట‌కు వ‌స్తున్నారు? అంటే.. ప్రశ్నార్థకంగానే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఎప్పుడూ లేనంత దుర్బర స్థితిలో పార్టీ ఉంది. చంద్రబాబు వ‌య‌స్సు మీద ప‌డ‌డంతో ఇప్పుడు లోకేష్ స‌త్తా మీదే పార్టీ భ‌విష్యత్తు ఆధార‌ప‌డి ఉంది. అయితే లోకేష్‌కు రాజ‌కీయాల్లో రాణించే స‌త్తా, జ‌గ‌న్ ఢీ కొట్టే వ్యూహ చ‌తుర‌త ఉందా ? అన్న దానిపై అటు సొంత పార్టీ నేత‌ల‌తో పాటు ఇటు ప్రజ‌ల్లోనూ ఉంది.

కష్ట సమయంలో…..

పార్టీ సంక్లిష్ట ప‌రిస్థితి నేప‌థ్యంలో పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోతుంటే… ద‌శాబ్దాలుగా పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఈ క‌ష్ట స‌మ‌యంలో పార్టీకి దూరంగా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఈ కుటుంబాల నేత‌లు కోరిన గొంతెమ్మ కోరిక‌లు అన్ని తీర్చారు. ప‌లువురు వార‌సుల‌కు టిక్కెట్లు ఇచ్చారు. కొన్ని కుటుంబాల‌కు ఒక‌టికి మించిన సీట్లు కూడా కేటాయించారు. వారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని త‌ప్పులు చేసినా భ‌రించారు.. పార్టీని ఎంత న‌ష్టప‌రిచినా స‌హించారు. అయితే ఇప్పుడు పార్టీ క‌ష్టాల్లో ఉంటే ఒకరిద్దరు మిన‌హా ఎవ్వరూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు స‌రిక‌దా… ? త‌మ‌కెందుకులే అని ప‌ట్టన‌ట్టుగా ఉన్నారు.

బాబు కూడా వదిలేసి….

ఎన్నిక‌ల త‌ర్వాత ఒక‌టి రెండు కుటుంబాలు మాత్రమే లైవ్‌లో క‌నిపిస్తున్నాయి. మిగిలిన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిణామాల‌తో పార్టీలో ఒక విధ‌మైన నైరాశ్యం ఏర్పడింది. ఇక‌, చంద్రబాబు కూడా వీరిపై ఎలాంటి ఒత్తిడీ తేక‌పోవడం గ‌మ‌నార్హం ఎవ‌రినీ బ‌య‌ట‌కు రావాల‌ని.. ఆయ‌న కోర‌డం లేదు. పైకి మాత్రం పార్టీని అభివృద్ధి చేయ‌డంలో క‌లిసి రావాల‌ని కోరుతున్నారు.కానీ, వినేవారు వింటున్నారు. మిగిలిన‌వారు క‌నీసం.. చంద్రబాబు మాట‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.

లోకేష్ మాత్రం…..

ఈ కుటుంబాల వార‌సుల‌కు లోకేష్ ఎంత ప్రయార్టీ ఇస్తున్నా కూడా వీరిలో కొంద‌రు డ్రామాలు ఆడుతోన్న విష‌యం కూడా ఆయ‌న దృష్టికి వెళ్లింది. దీంతో లోకేష్ టీడీపీ క‌ష్టకాలంలో ఉంది. ఉండేవాళ్లు ఉంటారు… పోయేవాళ్లు పోతారని పార్టీ ముఖ్యుల‌తో అన్నట్టు తెలిసింది. వీరిలో చాలా కుటుంబాల నేత‌లు, వార‌సులు మాత్రం పార్టీ పుంజుకున్నాక‌ ఎన్నికల స‌మ‌యం ద‌గ్గర ప‌డ్డాక చూసుకుందాంలే అనే ధోర‌ణిలో ఉన్నార‌ట‌. మ‌రి చంద్రబాబు వీరి విష‌యంలో అప్పటి వ‌ర‌కు వేచి చూస్తారా ? లేదా వీరి స్థానాల్లో కొత్త నేత‌ల‌కు ఛాన్సు ఇస్తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News