టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారట

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారాన్ని కొందరు టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. తమను గత ప్రభుత్వంలో ముప్పు తిప్పలు పెట్టి పార్టీని భ్రష్టుప్టించిన [more]

Update: 2020-02-11 08:00 GMT

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారాన్ని కొందరు టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. తమను గత ప్రభుత్వంలో ముప్పు తిప్పలు పెట్టి పార్టీని భ్రష్టుప్టించిన ఏబీ వెంకటేశ్వరరావు పై వేటు సబబేనని కొందరు టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం ఏబీకి అండగా నిలబడాలని ఇప్పటికే ఆదేశించింది. కొందరు మాజీ మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగి ఏబీ వెంకటేశ్వరరావుకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు.

అధిష్టానం ఆదేశాలతో….

దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు వంటి నేతలు ఏబీ సస్పెన్షన్ కక్ష సాధింపు చర్యలో భాగమేనంటున్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కేశినేని నాని ట్వీట్ పార్టీలో చర్చకు కారణమయింది. టీడీపీ ఓడిపోవడానికి, వైసీపీ గెలవడానికి కారణమైన ఏబీని సన్మానించకుండా సస్పెండ్ చేయడమేంటని కేశినేని నాని లేవనెత్తిన ప్రశ్న సరైనదేనంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు.

కర్రపెత్తనం చేస్తూ…..

ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమపై కర్రపెత్తనం చేశారని అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ వ్యూహాలు తెలుసుకోకుండా తమపై తప్పుడు నివేదికలను కూడా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. చివరకు టిక్కెట్ల కేటాయింపు సమయంలో కూడా ఏబీ వెంకటేశ్వరరావు తమను టెన్షన్ పెట్టారని గుర్తు చేస్తున్నారు.

జరగాల్సిందేనంటూ…..

టిక్కెట్ల కేటాయింపు సమయంలో తాము ఏబీ వెంకటేశ్వరరావు ను కలిసేందుకు వెళితే కనీసం కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకు వచ్చి ఏబీ పార్టీకి నష్టం చేశారని కూడా వారంటున్నారు. రాజకీయ సెటిల్ మెంట్లు ఎన్నో చేశారని, వ్యక్తిగత ఇష్టాలతో నివేదికలు ఇచ్చి పార్టీని ఇబ్బందుల పాలు చేశారని కొందరు ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరెోపణలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద టీడీపీ అధిష్టానం ఆదేశాలు ఉండటంతో బహిరంగంగా వ్యతిరేకించకపోయినా ఏబీ సస్పెన్షన్ కొందరు టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు.

Tags:    

Similar News