రేవంత్ దూకుడికి కొత్త రూట్ లో బ్రేక్ లు వేయాలని ?

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరెందుకు సిద్ధమైనట్లే ఉంది టి కాంగ్రెస్ లోని కొందరి నేతల పరిస్థితి. రేవంత్ రెడ్డి ని పిసిసి అధ్యక్షుడు కానీయకుండా అడ్డుకునేందుకు కిందా [more]

Update: 2021-08-29 09:30 GMT

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరెందుకు సిద్ధమైనట్లే ఉంది టి కాంగ్రెస్ లోని కొందరి నేతల పరిస్థితి. రేవంత్ రెడ్డి ని పిసిసి అధ్యక్షుడు కానీయకుండా అడ్డుకునేందుకు కిందా మీదా పడ్డారు. చివరికి కాంగ్రెస్ సీనియర్లు కొందరు తాము అనుకున్నది సాధించలేకపోవడంతో మరో దారి లో వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. దూకుడు గా టి కాంగ్రెస్ ను నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడే బ్రేక్ లు వేయకపోతే భవిష్యత్తులో కష్టమే అన్నది చాలా మంది సీనియర్ నేతలకు అర్ధం అయ్యింది. దాంతో అధిష్టానం ముందు కొత్త ప్రొపోజల్ తెస్తున్నారు టి పిసిసి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకట రెడ్డి.

కాంగ్రెస్ బలం బలహీనత అదే …

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటారు అని ఉద్యమ సమయంలో ప్రకటించిన టీఆర్ఎస్ అధిపతి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆయన తన మాట మీద నిలబడలేదు సరికదా ఆ మాటే ఎత్తకుండా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. దీనికి గులాబీ దళపతి అనేక వక్ర భాష్యాలు చెప్పుకున్నా విపక్షాలకు మాత్రం గట్టి అస్త్రాన్ని అందించింది. ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుని కోమటిరెడ్డి కాంగ్రెస్ ను గెలిపిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించేశారు. అందుకోసం సోనియా రాహుల్ లను సైతం ఒప్పిస్తా అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయం గా మారింది. కాంగ్రెస్ లో గ్రూపు లే బలం బలహీనత అంటారు. అది నిజమే అని మరోసారి వెంకటరెడ్డి వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. అధిష్టానాన్ని మెప్పించి పిసిసి పీఠం దక్కించుకోలేక పోయిన కోమటిరెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా సామాజిక వర్గానికి అని చెప్పడం హస్తం దళంలో కామెడీ గా చెప్పుకుంటున్నారు ఆ పార్టీ వర్గాలే.

దళితబంధు కు చెక్ పెట్టేందుకా … ?

హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ వేయని ఎత్తులు లేవు. దళితబంధు పథకం ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా అండగా ఉండే దళితుల ఓటుబ్యాంక్ గంపగుత్తగా కొల్లగొట్టాలన్నది కెసిఆర్ వ్యూహం. దీనికి విరుగుడు గా కోమటిరెడ్డి దళిత సిఎం ఆఫర్ ప్రకటించారా లేక తెలంగాణ లో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలనుకుంటున్న రేవంత్ ఆశలకు ఆదిలోనే గండికొట్టేందుకా అన్నది హాట్ టాపిక్ నే అయ్యింది. మొత్తానికి ఆలు లేదు సూలు లేదు అన్నట్లు కాంగ్రెస్ నేతల హడావిడి మాత్రం ఆసక్తిగానే నడుస్తుంది.

Tags:    

Similar News