విహెచ్ కొత్త పార్టీ అదేనా ?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు కొత్త పార్టీ పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారా ? వరుసగా తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను ఇక ఆయన [more]

Update: 2019-08-10 03:46 GMT

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు కొత్త పార్టీ పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారా ? వరుసగా తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను ఇక ఆయన తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా ? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. బయటవారితో ఎంతకాలం అయినా పోరాటం చేస్తాం. సొంత పార్టీ పై కూడా నిత్యం గొడవలు పడుతూ ఉండి సాధించేది ఏమిటన్నది విహెచ్ ఆలోచనగా ఉందని తెలుస్తుంది. అధిష్టానం మూలన పెట్టేయడంతో బాటు టి పిసిసి లో ఎవరితో ప్రస్తుతం విహెచ్ కి సఖ్యత లేదు. దాంతో ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని విహెచ్ లెక్కేస్తున్నారని అంటున్నారు.

మూడు సార్లు రాజ్యసభ ఇచ్చినా …

కాంగ్రెస్ పార్టీలో ఏ టికెట్ దక్కాలన్నా చాలా అదృష్టమే ఉండాలి. టికెట్ వచ్చి గెలిస్తే తరువాత ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో తెలియదు. అలాంటిది. హనుమంత రావు కు ఏకంగా మూడు సార్లు రాజ్యసభ టికెట్ ను అధిష్టానం కేటాయించి గౌరవించింది. గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా తనను తాను ప్రకటించుకునే విహెచ్ అందుకు తగ్గ ప్రతిఫలం కన్నా ఎక్కువే అందుకున్నారు పార్టీ నుంచి. అయితే ఆ గౌరవం ఆయనకు చాలడం లేదు. యువతతో పోటీ పడుతూ పెద్ద వయస్సులో రాజకీయాలు సాగిస్తున్నారు. అయితే ఇటీవల విహెచ్ ను మించి భజన చేసేవారు అధిష్టానం కోటలో చేరిపోవడంతో ఏడాదిగా ఆయనకు రాహుల్, సోనియా లనుంచి నో అపాయింట్మెంట్.

తెలంగాణ రాజీవ్ కాంగ్రెస్ పేరుతో …

రాజీవ్ గాంధీ భక్తుడైన విహెచ్ తన గాడ్ ఫాదర్ పేరుతోనే పార్టీ పెట్టె ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అధిష్టానం పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్న ఆయన పార్టీ వీడిపోతారనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. ప్రస్తుతం వన్మేన్ ఆర్మీగా వుండే విహెచ్ ను ఏ పార్టీ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్ళినా కాంగ్రెస్ పార్టీలో దక్కిన గౌరవం కూడా దక్కకపోవొచ్చని దీనికి తోడు భావప్రకటనా స్వేచ్చ ఉండదని అటువైపు చూడటం లేదంటున్నారు. అందుకే తనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజీవ్ పేరిట పార్టీ పెట్టాలని అది ఈనెలలో రాజీవ్ జయంతి రోజున ప్రకటించాలని యోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. విహెచ్ పెట్టె ఈ పార్టీ కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరించడానికా లేక పునరావాసకేంద్రంగా తన రాజకీయ చరమాంకంలో వినియోగించుకుంటారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News