గవర్నర్ అదే చేస్తే?

శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. గవర్నర్ నేరుగా రంగంలోకి దిగడంతో శాసనమండలి కార్యదర్శి పై వేటు తప్పదన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. శాసనమండలి [more]

Update: 2020-02-20 00:30 GMT

శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. గవర్నర్ నేరుగా రంగంలోకి దిగడంతో శాసనమండలి కార్యదర్శి పై వేటు తప్పదన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. శాసనమండలి వ్యవహారం రాజ్ భవన్ కు చేరింది. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలసి శాసనమండలిలో జరిగిన పరిణామాలను వివరించిన సంగతి తెలిసిందే. శాసనమండలి కార్యదర్శిపై గవర్నర్ కు షరీఫ్ ఫిర్యాదు చేశారు.

షరీఫ్ ఫిర్యాదుతో….

తాను రూలింగ్ ఇచ్చినా రెండుసార్లు సెలెక్ట్ కమిటీ విషయాన్ని వెనక్కు పంపడాన్ని షరీఫ్ తప్పుపడుతున్నారు. శాసనమండలి కార్యదర్శి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని షరీఫ్ ఆరోపిస్తున్నారు. దీంతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాసనమండలి కార్యదర్శిని నివేదికను కోరినట్లు తెలిసింది. దీనిపై ఆయన వివరణను రాజ్ భవన్ కోరడంతో కార్యదర్శిపై గవర్నర్ చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఆయన స్థానంలో……

శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు స్థానంలో విజయరాజుకు ఆ బాధ్యతలను అప్పగించాలని కూడా షరీఫ్ గవర్నర్ ను కోరినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న బాలకృష్ణమాచార్యులను సస్పెండ్ చేయాలని కూడా గవర్నర్ ను షరీఫ్ కోరారు. చట్టసభలు గవర్నర్ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి కాబట్టి ఆయన దృష్టికి మొత్తం వ్యవహారాన్ని షరీఫ్ తీసుకెళ్లారు. కొత్త సెక్రటరీని కూడా గవర్నర్ నియమించాల్సి ఉండటంతో ఆయననే ఆశ్రయించారు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్.

పరిశీలిస్తున్న కార్యాలయం….

అయితే దీనిపై గవర్నర్ కార్యాలయం శాసనమండలి కార్యదర్శి వివరణ కోరినట్లు సమాచారం. పార్లమెంటరీ సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగాయా? అన్న విషయాలపై తన కార్యాలయ సిబ్బందిని గవర్నర్ పురమాయించారు. షరీఫ్ ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారంటున్నారు. శాసనమండలికి సంబంధించిన రికార్డులన్నింటినీ గవర్నర్ పరిశీలిస్తున్నారు. రూల్స్ బుక్ ఏం చెబుతుందో తెలుసుకుని దాని ప్రకారం చర్యలు ఉండవచ్చని టీడీపీ సయితం అభిప్రాయపడుతుంది. శాసనమండలి కార్యదర్శిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News