సీత మూవీ రివ్యూ

బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్‌, మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్: వెంకటేశ్వరరావు [more]

Update: 2019-05-24 10:17 GMT

బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్‌, మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఎడిటింగ్: వెంకటేశ్వరరావు కోటగిరి
సినిమాటోగ్రఫీ: శీర్షా రే
దర్శకుడు: తేజ

టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో భారీ బడ్జెట్ సినిమాలతో క్రేజ్ ఉన్న హీరోయిన్స్, పెద్ద డైరెక్టర్స్ తో కలిసి సినిమాలు చేస్తున్న కాస్ట్లీ నిర్మాత కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా… నేనే రాజు నేనే మంత్రి సినిమాతో భారీ ఫామ్ లోకొచ్చిన దర్శకుడు తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సీత సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకొని బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎప్పుడో ఫామ్ కోల్పోయి ఇప్పుడే సక్సెస్ ట్రాక్ ఎక్కిన తేజ సీత సినిమాతో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ ఇచ్చాడా? భారీ క్రేజ్ ఉన్న కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండోసారి నటించింది. మరి బెల్లంకొండ – కాజల్ కలిసి నటించిన మొదటి సినిమా కవచం ఫ్లాప్ అయితే ఇప్పుడు మరోసారి జోడీ కట్టిన సీత సినిమా పరిస్థితి ఏమిటి? హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఉన్న ఈ కథను కాజల్ అగర్వాల్ నేనే చేస్తానని మరీ పట్టుబట్టి చేసింది. మరి కాజల్ కి అనుకున్న సక్సెస్ ఈ సీత సినిమాతో దక్కిందా? అనేది సమీక్షలో తేలుకుందాం.

కథ

సీత (కాజ‌ల్‌)కి డ‌బ్బే లోకం. డ‌బ్బే స‌ర్వస్వం. అందితే కాళ్లు, లేదంటే జుట్టు ప‌ట్టుకునే ర‌కం. రియ‌ల్ ఎస్టేట్ దందాలో వంద కోట్లు పోతున్నాయ‌ని కొన్ని కారణాల చేత లోకల్ ఎమ్మెల్యే బసవరాజు (సోనూ సూద్) సహాయం కోరుతుంది. తాను చేసిన సహాయానికి ప్రతిఫలంగా తనతో సహ జీవనం చేయాలని బసవరాజు షరతు పెడతాడు. నెల రోజుల పాటు సహజీవనానికి బసవరాజుతో సీత ఒప్పందం చేసుకుంటుంది. బసవరాజుతో పని పూర్తయ్యాక సీత అతనికి హ్యాండ్ ఇస్తుంది. అలాంటి ఒప్పందానికి తాను కట్టుబడి ఉండనని షాక్ ఇస్తుంది. దీంతో సీతను దక్కించుకోవడానికి బసవ తన పవర్‌ను ఉపయోగిస్తాడు. అన్ని వైపుల నుంచి సీతను బ్లాక్ చేసేస్తాడు. ఇలాంటి సమయంలో సీతకు రఘురాం(బెల్లంకొండ శ్రీనివాస్) రూపంలో అండ దొరుకుతుంది. అసలు ఈ రఘురాం ఎవరు? సీతకు రఘురాం ఏమవుతాడు? రఘురాం ఏ విధంగా సీతకు సాయపడ్డాడు? సీత మ‌న‌సులో రఘురాం ఎలా స్థానం సంపాదించుకున్నాడు? బ‌స‌వ‌రాజు నుంచి సీత త‌ప్పించుకుందా? లేదా?అనేదే మిగిలిన క‌థ‌.

నటీనటుల నటన

మొదటి నుండి చెబుతున్నట్టే సీత సినిమాకు బలమంతా కాజల్ అగర్వాలే. సీత క్యారెక్టర్ లో నటనతో మైమరిపించింది. డ‌బ్బు వ్యామోహంతో, మ‌నుషుల్ని మాన‌వ‌త్వాన్ని మ‌ర్చిపోయిన ఇలాంటి క‌థానాయిక పాత్రని ఎప్పుడో గానీ చూడం. విపరీతమైన తలబరువుతో, తాను చెప్పిందే జరగాలనే అహంకారంతో, తన అవసరం కోసం ఏమైనా చేయడానికి వెనకాడని అమ్మాయి పాత్రలో కాజల్ నటన అద్భుతం. ఎంత బాగా నటించిందంటే.. కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూసి మనకే కోపం, ఉద్రేకం వచ్చేస్తాయి. కాక‌పోతే త‌న మేక‌ప్ ఓవ‌ర్‌గా అనిపిస్తుంది. ఇక కాజల్ తో పోటాపోటీగా నటించింది విలన్ క్యారెక్టర్ చేసిన సోనూ సూద్. చాలా రోజుల తరవాత తెలుగులో మరో మంచి పాత్ర దక్కింది. సీతను దక్కించుకునే క్రమంలో సోను సూద్ చేసే పనుల్లో కామెడీ పండింది. ఇక హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక కొత్త పాత్రను ప్రయత్నించాడు. అమాయకుడి పాత్రలో బాగానే నటించాడు. అయితే, ఈ పాత్రని ఇంకాస్త బాగా తీర్చిదిద్దొచ్చు అనిపిస్తుంది. తనికెళ్ల భరణి, మన్నారా చోప్రా, బిత్తిరి సత్తి, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేర నటించారు.

విశ్లేషణ

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కన్నా ఈ సినిమాలో కాజల్ పాత్రే హైలెట్. అందుకే టైటిల్ కూడా సీత అనే పెట్టాడు తేజ. దర్శకుడు తేజ సినిమాల్లో హీరోయిన్ పాత్ర బలంగా ఉంటుంది. హీరోతో సమానమైన పాత్రని హీరోయిన్ కి కూడా రాసుకుంటాడు తేజ. నేనె రాజు నేనె మంత్రి సినిమాలో రానా తో సమానమైన పాత్ర కాజల్ కి ఇచ్చాడు. ఈసారి మాత్రం హీరోయిన్ కాజల్ ని హైలెట్ చేస్తూ హీరో ని నామమాత్రంగా తీసుకున్నాడు. హీరోయిన్ పాత్ర తో పాటుగా విలన్ పాత్రను బలంగా రాసుకున్నాడు. అయితే గతంలో తేజ చేసిన తప్పే ఈ సీత విషయంలోనూ రిపీట్ అయ్యింది. సీత కథలో పెద్దగా దమ్ము లేదు. దీనికి తోడు బలహీనమైన కథనం. తరవాత ఏం జరగబోతోందో ముందుగానే ప్రేక్షకుడు ఊహించేయగలగడం. ఇవే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్‌లు. కథ, కథనం విషయంలో దర్శకుడు తేజ ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. సీతను ఎలా అయినా అనుభవించాలనే కోరికతో సోను సూద్ తరుముతుండటం.. అతని నుంచి తప్పించుకోవడానికి సీత పెట్టే పరుగు.. ఈ గేమ్ ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే సినిమా స్థాయి ఇంకోలా ఉండేది. కథనంలో కూడా వేగం లేకపోవడంతో సినిమా కాస్త విసుగుతెప్పిస్తుంది. సీత క్యారెక్టరైజేష‌న్‌పై అతిగా ఆధార‌ప‌డిపోయిన తేజ.. మిగిలిన పాత్రల్ని అంత స‌వ్యంగా, ప్రభావ‌వంతంగా న‌డిపించలేక‌పోయారు. రామ్‌గా బెల్లంకొండ శ్రీ‌నివాస్ పాత్ర చూస్తుంటే చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఒక్కోసారి రామ్ అతి మంచిత‌నం కూడా ప్రేక్షకుల్ని విసిగిస్తుంటుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త మెరుగనిపిస్తుంది. కామెడీకి స్కోప్ బాగానే ఉన్నా అంతగా వాడుకోలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ బుల్ రెడ్డి ఐటమ్ సాంగ్ కూడా పేలలేదు. పాయల్ రాజ్‌పుత్ అందచందాలతో మెప్పించినా.. పాట చిత్రీకరణ, కొరియోగ్రఫీ అంత గొప్పగా లేవు. పాటలో ఉన్న ఊపు తెరపై కనిపించలేదు. మరి ఈ సినిమా చూస్తున్నంత సేపూ తేజ మళ్లీ తన పాట రూట్ లోకే వెళ్లిపోయాడా? అసలు ఈ సినిమాలో ఏం చూసి బెల్లంకొండ హీరోగా ఒప్పుకున్నాడు? అని ప్రతి ప్రేక్షకుడికి అనిపిస్తుంది. సాంకేతికంగానూ సీత సినిమా కి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అనూప్ రూబెన్స్ పాటలు పర్వాలేదు కానీ… బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అనుకున్నంతగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం ఆకట్టుకునేలా లేదు. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.

రేటింగ్: 2.25/5

Tags:    

Similar News