లాక్ డౌన్ కొనసాగింపే కానీ.. సడలింపులు కూడా?

లాక్ డౌన్ ను సడలిస్తారా? కొనసాగిస్తారా? ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చ అయింది. ఈ నెల 3వ తేదీతో రెండో విడత లాక్ డౌన్ [more]

Update: 2020-05-01 17:30 GMT

లాక్ డౌన్ ను సడలిస్తారా? కొనసాగిస్తారా? ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చ అయింది. ఈ నెల 3వ తేదీతో రెండో విడత లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మే 2వ తేదీన ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశముంది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటట్లు సమాచారం.

మూడు జోన్లుగా విభజించి…

దేశ వ్యాప్తంగా మూడు జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ వైరస్ అంటుకుంది. దీనిని గమనించిన ప్రభుత్వం ీఈసారి లాక్ డౌన్ విషయంలో మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముంబయి, పూనే, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాల్లో వైరస్ ఎక్కువగా ఉంది.

కొన్నింటికి మినహాయింపులు…..

దీంతో రెడ్ జోన్లు, హాట్ స్పాట్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిస్థాయి మినహాయింపులు ఇవ్వాలని భావిస్తుంది. ప్రజా రవాణా, మాల్స్, హోటల్స్ కు మాత్రం అనుమతిని ఇప్పట్లో ఇవ్వకూడదని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. కరోనా ఫ్రీగా ఉన్న జిల్లాల్లో ఆ ప్రాంతం వరకూ బస్సులను తిప్పే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఇప్పటికే అనేక రాష్ట్రాలు….

లాక్ డౌన్ ను మే 18వ తేదీ వరకూ పొడిగిస్తూ మినహాయింపులు కూడా అదే స్థాయిలో ఇవ్వాలని మోదీ నిర్ణయించారని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగిస్తూనే మినహాయింపులు మాత్రం ఈసారి ఎక్కువగా ఉంటాయని, ప్రధానంగా చిరు వ్యాపారులు, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News