లక్కీ ఛాన్స్ అనుకుంటే… అలా కాదటగా?

లక్కీగా ఛాన్స్ వచ్చినప్పుడు దానిని నిలుపునే వారే అసలైన లీడర్. తనకు లక్ గా వచ్చినా తన సమర్థత ఇదీ అని నిరూపించుకునేందుకే ప్రయత్నిస్తారు. కానీ వైసీపీలో [more]

Update: 2020-12-17 08:00 GMT

లక్కీగా ఛాన్స్ వచ్చినప్పుడు దానిని నిలుపునే వారే అసలైన లీడర్. తనకు లక్ గా వచ్చినా తన సమర్థత ఇదీ అని నిరూపించుకునేందుకే ప్రయత్నిస్తారు. కానీ వైసీపీలో కొత్తగా ఎంపికయిన ఎంపీలను చూస్తే అలా అనిపించదు. ఒకసారి ఎంపీగా చేస్తే చాలులే అన్న ధోరణి ఎక్కువమందిలో కన్పిస్తుంది. ప్రస్తుతం వైసీపీలో ఎంపీలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందులో ఒకరు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి.

డాక్టర్ గా మెప్పించి….

సత్యవతి వృత్తిరీత్యా వైద్యురాలు. వైద్యురాలిగా మంచి పేరుంది. దీంతో పాటు ఆ ప్రాంతంలో సామాజిక సేవలను కూడా సత్యవతి ఎప్పటి నుంచో నిర్వహిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలకు సత్యవతి డాక్టరమ్మగా సుప్రసిద్ధులే. దీంతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరుపున అనూహ్యంగా సత్యవతి పేరు బయటకు వచ్చింది. స్కెత్ స్కోప్ పట్టుకునే డాక్టర్ సత్యవతి చేతికి వైఎస్ జగన్ జెండా ఇచ్చేశారు. అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు.

జనం సమస్యలతో…..

అయితే డాక్టర్ గా మంచి పేరున్న సత్యవతికి గడిచిన పద్ధెనిమిది నెలల్లోనే రాజకీయ నేతగా చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఎంపీగా ఆమె ప్రజాసమస్యల పట్ల పెద్దగా పట్టించుకోవడం లేదు. అనకాపల్లి బెల్లం మార్కెట్ సమస్యలపైనా, చెరకు రైతుల సమస్యలను కూడా సత్యవతి పట్టించుకోలేదు. కనీసం పార్లమెంటులోనూ సత్యవతి గళం విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. సత్యవతి డాక్టర్ గా సక్సెస్ అయ్యారు తప్పించి పార్లమెంటీరియన్ గా ఫెయిలయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆరోపణలతో మరింత దూరం….

దీనితో పాటు కరోనా సమయంలో సత్యవతి కుటుంబంపై వచ్చిన విమర్శలు ఇంకా వీడిపోలేదు. రేషన్ బియ్యాన్ని దారి మళ్లించిన కేసును ఎంపీ సత్యవతికి చెందిన ట్రస్ట్ పై పోలీసులు కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ వివాదంతో సత్యవతి మరింత డీలా పడ్డారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో దూరంగా ఉంటున్నారు. కరోనా సమయం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. మొత్తం మీద సత్యవతి పదిహేను నెలల్లోనే రాజకీయం అవగతమై దూరం పాటిస్తున్నారని టాక్.

Tags:    

Similar News