చిన్నమ్మను చేరదీస్తారా?

అన్నాడీఎంకే అధినేతగా జైలుకు వెళ్లిన శశికళ త్వరలో విడుదలయ్యే అవకాశముంది. డిసెంబరు చివరలో శశికళ ముందస్తుగా విడుదలవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శశికళ జైలు నుంచి బయటకు [more]

Update: 2019-10-26 18:29 GMT

అన్నాడీఎంకే అధినేతగా జైలుకు వెళ్లిన శశికళ త్వరలో విడుదలయ్యే అవకాశముంది. డిసెంబరు చివరలో శశికళ ముందస్తుగా విడుదలవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే నేతలు మాత్రం మైండ్ గేమ్ ప్రారంభించారు. తమిళనాడు అసెంబ్లీకి 2021లో ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకే ప్రస్తుతం నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళ పార్టీ పగ్గాలు చేపడితే తిరిగి గెలిచే అవకాశముందన్నది అన్నాడీఎంకే వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

అన్నాడీఎంకేలో చేరతారని….

అన్నాడీఎంకేలో శశికళ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని ఆ పార్టీలో ఒకవర్గం బహిరంగంగానే చెబుతోంది. ఈ మేరకు శశికళ రాకను ఆమెను పూర్తిగా వ్యతిరరేకిస్తున్న పన్నీర్ సెల్వానికి కూడా తెలిపారంటున్నారు. శశికళ నేతృత్వంలో 2021 ఎన్నికలకు వెళితే మరోసారి అధికారంలోకి రావచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తుంది. శశికళ ముందస్తు విడుదలపై కూడా ఆ పార్టీ పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు.

పన్నీర్ ససేమిరా….

అయితే పన్నీర్ సెల్వం దీనికి అంగీకరిస్తారా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. పన్నీర్ సెల్వాన్ని జయలలిత బతికి ఉన్నప్పుడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసింది. చివరిసారిగా జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అయితే జయలలిత మరణం తర్వాత శశికళ పన్నీర్ సెల్వం స్థానంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. పన్నీర్ సెల్వంపై పగ సాధిస్తానంటూ జయలలిత సమాధి సాక్షిగా శశికళ ప్రమాణం కూడా చేశారు.

మైండ్ గేమ్ లో భాగంగా….

వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని అన్నాడీఎంకేలో శశికళ రాకను పన్నీర్ సెల్వం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే ఈ ప్రచారమంతా దినకరన్ వర్గాన్ని, పార్టీని దెబ్బకొట్టడానికే నంటున్నారు. ఇప్పటికే దినకరన్ పార్టీ నుంచి అనేక మంది నేతలు అన్నాడీఎంకే, డీఎంకేల వైపు వెళ్లారు. మరింత మందిని తమవైపునకు రప్పించుకునేందుకే అన్నాడీఎంకే ఈ ప్రచారానికి దిగుతుందన్నది దినకరన్ మండి పడుతున్నారు. మైండ్ గేమ్ లో ఎవరూ పడిపోవద్దని ఆయన తన పార్టీ నేతలకు నచ్చ చెబుతున్నారు. మొత్తం మీద శశికళ జైలు నుంచి విడుదల కాకముందే తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి.

Tags:    

Similar News