Tamilnadu : కమలం స్కెచ్ లో పడిపోతున్నారా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి ఉంది. తమిళనాడులో కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. రానున్న కాలంలో శశికళ చేతికి పార్టీ పగ్గాలు అందే అవకాశాలు [more]

Update: 2021-10-20 16:30 GMT

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి ఉంది. తమిళనాడులో కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. రానున్న కాలంలో శశికళ చేతికి పార్టీ పగ్గాలు అందే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలను విడదీసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. చిన్నమ్మ ట్రాప్ లో పన్నీర్ సెల్వం పడినట్లే కన్పిస్తుంది. శశికళ రీ ఎంట్రీ వెనక కూడా కేంద్రం పెద్దల హస్తం ఉందన్న ప్రచారమూ జరుగుతుంది.

కేంద్రం పెద్దల అండదండలతోనే…

శశికళ రీ ఎంట్రీ కేంద్రం పెద్దల అండదండలతోనే జరుగుతుంది. రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నానని ప్రకటించిన శశికళ నెలలు తిరక్క ముందే మనసు మార్చుకున్నారు. తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శినని ప్రకటించుకున్నారు. అందరూ ఐక్యంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. నిజానికి తమిళనాడులో మరో నాలుగున్నరేళ్ల వరకూ ఎన్నికలు లేవు. ఇప్పుడే వచ్చి శశికళ ఉద్దరించాల్సింది కూడా ఏమీ లేదు. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం వేసిన స్కెచ్ గా కొందరు చెబుతున్నారు.

పార్లమెంటు ఎన్నికల కోసమేనా?

వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో కర్ణాటక తప్ప బీజేపీకి ఎక్కడా అవకాశం లేదు. తమిళనాడులో డీఎంకే బలంగా ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్ కు మద్దతిస్తుంది. అయితే బీజేపీకి అన్నాడీఎంకే మద్దతిస్తున్నప్పటికీ కనీస స్థానాలను సాధించే స్థిితిలో లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు నాయకత్వం కోసం కొట్టుకుంటున్నారు. వీరికి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు తెచ్చే పరిస్థితి లేదు. అందుకే శశికళను రంగంలోకి దించారని పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

పన్నీర్ సెల్వం చూపు….

మరోవైపు పన్నీర్ సెల్వం శశికళ వైపు చూస్తున్నారు. పార్టీ తిరిగి నిలదొక్కుకోవాలంటే శశికళ నాయకత్వం అవసరమని ఆయన భావిస్తున్నారు. పార్టీ బలోపేతం అవ్వడం కంటే పళనిస్వామిని వీక్ చేయాలన్నదే పన్నీర్ సెల్వం ఆలోచనగా ఉంది. ఇద్దరికీ పార్టీ పదవుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. మరోవైపు బీజేపీ నేతలతో పన్నీర్ సెల్వం తొలి నుంచి టచ్ లో ఉంటున్నారు. దీంతో శశికళ సులువుగానే అన్నాడీఎంకేలోకి రీ ఎంట్రీ ఇస్తారంటున్నారు.

Tags:    

Similar News