మళ్లీ చిన్నమ్మకే పగ్గాలు… లైన్ క్లియరవుతుందా?

అన్నాడీఎంకే పగ్గాలు అందుకునేందుకు మళ్లీ శశికళ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆమె సంకేతాలు పంపుతున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం పొందడంతో తిరిగి పార్టీని [more]

Update: 2021-05-18 18:29 GMT

అన్నాడీఎంకే పగ్గాలు అందుకునేందుకు మళ్లీ శశికళ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆమె సంకేతాలు పంపుతున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం పొందడంతో తిరిగి పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు శశికళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆమె గెలిచిన ఎమ్మెల్యేలతో టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల చేతుల్లో పార్టీ ఉంటే భవిష‌్యత్ లేదని శశికళ ఎమ్మెల్యేలకు చెబుతున్నట్లు సమాచారం.

రాజకీయాలకు దూరంగా….

శశికళ జైలు నుంచి విడుదలయినప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లోనూ ఆమె ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రజలు అన్నాడీఎంకేకు ఓటేయాలని శశికళ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడం, ప్రతిపక్ష స్థానంలో ఉండటంతో శశికళ తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఓడిన నేతలందరూ….

అన్నాడీఎంకేలోని ఎక్కువ మంది నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత సన్నిహితురాలిగా మాత్రమే కాకుండా ఆర్థికంగా బలమున్న శశికళ అయితేనే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గట్టెక్కించగలదని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు కొందరు శశికళతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. శశికళ వస్తేనే పార్టీకి భవిష‌్యత్ ఉంటుందని వారు చెబుతున్నారు.

బీజేపీ కూడా…..

మరోవైపు అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ కూడా ఇదే అభిప్రాయంలో ఉంది. శశికళకు పార్టీ కూడా అండగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా కొనసాగిస్తూనే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. శశికళ కూడా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న కాలంలో అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేేతికి రావడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News