కమల్ కూటమికి కలిసొస్తుందా?

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకూ తమిళనాడులో రెండు కూటములే ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ఇప్పటి వరకూ ఎన్నికల [more]

Update: 2021-03-15 18:29 GMT

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకూ తమిళనాడులో రెండు కూటములే ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ఇప్పటి వరకూ ఎన్నికల బరిలో నిలుస్తూ వస్తున్నాయి. అయితే జయలలిత, కరుణానిధి మరణం తర్వాత మాత్రం పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి. ప్రధానంగా శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ….

ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ తమిళనాడులో కూటముల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యయ్ పార్టీ తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే శశికళను ఈ కూటమిలోకి చేర్చుకునేందుకు కమల్ హాసన్ సుముఖంగా లేరు. అవినీతి ఆరోపణలున్న శశికళను తమ కూటమిలో చేర్చుకోబోమని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. తానే తృతీయ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థినని కమల్ హాసన్ ప్రకటించారు.

నాల్గో కూటమికి…..

మరోవైపు శశికళ కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ఎన్నికల వరకే ఈ ప్రకటన ఉంటుందా? ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే ఓటమి పాలయితే ఆ పార్టీని చేజిక్కిచ్చుకునేందుకు శశికళ ఈ ఎత్తుగడ వేశారా? అన్నది తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శశికళ హటాత్తు నిర్ణయం విశ్లేషకులను సయితం ఆశ్చర్యంలో పడేసింది.

అన్నాడీఎంకేకే ఇబ్బంది తప్పదా?

శశికళ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా అన్నాడీఎంకేను గెలిపించాలని మాత్రం పిలుపు నివ్వలేదు. డీఎంకేను ఓడించాలని మాత్రమే శశికళ కోరారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తృతీయ కూటమి కూటమిలో ఏ ఏ పార్టీలు ఉండబోతున్నాయన్నది మరి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. అయితే లోపాయికారీగా శశికళ కమల్ హాసన్ కూటమికి మద్దతిచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద శశికళ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కమల్ హాసన్ కూటమికి కలసి వస్తుందంటున్నారు.

Tags:    

Similar News