చిన్నమ్మ చికాకు పడుతున్నారా?

కరోనా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టినట్లే జయలలిత సన్నిహితురాలు శశికళకు కూడా ఇబ్బందిని తెచ్చిపెట్టింది. అయితే శశికళకు కరోనా వైరస్ సోకలేదు. అయితే కరోనా కారణంగా పరప్పణ అగ్రహార [more]

Update: 2020-10-26 18:29 GMT

కరోనా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టినట్లే జయలలిత సన్నిహితురాలు శశికళకు కూడా ఇబ్బందిని తెచ్చిపెట్టింది. అయితే శశికళకు కరోనా వైరస్ సోకలేదు. అయితే కరోనా కారణంగా పరప్పణ అగ్రహార జైలు అధికారులు శశికళను ఎవరూ కలవడానికి అంగీకరించడం లేదు. శశికళ దాదాపు మూడున్నరేళ్ల నుంచి పరప్పణ అగ్రహారజైలులో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరిలో…..

శశికళ శిక్షాకాలం వచ్చే ఏడాది జనవరికి పూర్తి అవుతుందని చెబుతున్నారు. మరో రెండు నెలల్లో శశికళ జైలు నుంచి బయటకు వస్తారు. అందుకు ఆమె పది కోట్ల రూపాయల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో శశికళ ఇటీవల తన న్యాయవాదికి లేఖ కూడా రాశారు. పదికోట్లు జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని శశికళ న్యాయవాదికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదించాలని శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ములాఖత్ లను నిలిపేయడంతో…..

అయితే మార్చి నెల నుంచి శశికళతో ములాఖత్ కు జైలు అధికారులు ఎవరీనీ అంగీకరించడం లేదు. దాదాపు ఏడు నెలల నుంచి శశికళ ఎవరినీ కలవడం లేదు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగుతుండటం, ఆమె బయటకు వస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహంపై తన మేనల్లుడు దినకరన్ తో చర్చించాలన్నా వీలుపడటం లేదు. కరోనా తీవ్రత కారణంగా కర్ణాటక జైళ్ల శాఖ ములాఖత్ లను రద్దు చేయడంతో ఎవరినీ కలవకుండా వీలులేకపోయింది.

వచ్చే సరికి…..

దీంతో శశికళ బయటకు వచ్చిన వెంటనే ఏం చేయనున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. శశికళ బయటకు వచ్చే సమయానికి దాదాపు అన్ని పార్టీలూ కూటములు ఖరారు చేసుకుంటాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శశికళ బయటకు వచ్చేసరికి ఆమె చేయాల్సిన పనులేవీ ఉండవని పన్నీర్, పళనిస్వామిలు ధైర్యంగా ఉన్నారు. ములాఖత్ లు రద్దుతో చిన్నమ్మ చికాకుగా ఉన్నారని జైలు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News