అయ్యో…శరద్ యాదవ్….!!

జనతాదళ్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్ పరిస్థిితి దయనీయంగా తయారైంది. తన సొంత పార్టీ పెట్టుకున్నా ఆయన వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి [more]

Update: 2019-03-29 17:30 GMT

జనతాదళ్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్ పరిస్థిితి దయనీయంగా తయారైంది. తన సొంత పార్టీ పెట్టుకున్నా ఆయన వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. జనతాదళ్ యును స్థాపించిన శరద్ యాదవ్ కు గత రెండేళ్లుగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆయన స్థాపించిన జనతాదళ్ యు కు బీహార్ లో మంచి పట్టుంది. తాను నాటిన మొక్క మానై… ఫలాలు ఇస్తున్న వేళ ఆ పార్టీ వేరే వారి చేతుల్లోెకి వెళ్లిపోయినా చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

నమ్మకమైన మిత్రుడని….

జనతాదళ్ యు అధినేత శరద్ యాదవ్ కు నితీష్ కుమార్ మంచి మిత్రుడు. నమ్మకమైన స్నేహితుడు. అయితే బీహార్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా నితీష్ కుమార్ రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుుకున్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుల అవినీతి కారణంగానే తాను కూటమి నుంచి తప్పుకున్నట్లు నితీష్ ప్రకటించారు. దీనికి శరద్ యాదవ్ అభ్యంతరం చెప్పినా నితీష్ అంగీకరించలేదు.

కొత్త పార్టీ పెట్టినా….

చివరకు జనతాదళ్ యును కూడా నితీష్ తన అధీనంలోకి తీసుకున్నారు. శరద్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరణకు గురి చేశారు. బీజేపీకి వ్యతిరేకంగానే శరద్ యాదవ్ జనతాదళ్ యును ఏర్పాటు చేశారు. చివరకు ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దయింది. పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని శరద్ యాదవ్ పై నితీష్ కుమార్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో శరద్ యాదవ్ లోక్ తాంత్రిక్ జనతాదళ్ అనే కొత్త పార్టీని పెట్టారు.

ఆర్జేడీ నుంచి….

కానీ రానున్న ఎన్నికల్లో బీహార్ నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఆయన తన సొంత పార్టీ నుంచి పోటీ చేయడం లేదు. సొంత పార్టీకి గుర్తు సమస్య, జనంలోకి ఇంకా వెళ్లకపోవడంతో ఆయన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల అనంతరం తన లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తారని చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి ఆయనకు ఒక్కరే సీటు లభించడం విశేషం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి పార్టీ పెట్టి బీహార్ లో అధికారంలోకి తెచ్చిన శరద్ యాదవ్ ిఇప్పుడు పరాయి పార్టీ నుంచి పోటీ చేయాల్సి రావడం నిజంగా విచిత్రమే.

Tags:    

Similar News