ఇక్కడ కొడితే అక్కడ వచ్చినట్లే

ఇక్కడ పట్టున్న వారే అధికారంలోకి వస్తారు. ఇక్కడ అత్యధిక సీట్లను సాధించుకున్న వారే అందలమెక్కుతారు. అందుకే అన్ని పార్టీల కన్ను ఆ ప్రాంతంపైనే ఉంది. అక్కడే ప్రచారం [more]

Update: 2019-10-15 17:30 GMT

ఇక్కడ పట్టున్న వారే అధికారంలోకి వస్తారు. ఇక్కడ అత్యధిక సీట్లను సాధించుకున్న వారే అందలమెక్కుతారు. అందుకే అన్ని పార్టీల కన్ను ఆ ప్రాంతంపైనే ఉంది. అక్కడే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కొంకణ్ ప్రాంతంలో పోయిన పట్టును తిరిగి నిలుపుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో శివసేన, బీజేపీలు సయితం ఇక్కడ అత్యథిక స్థానాలను గెలుచుకుని మరోసారి పవర్ లోకి రావాలని భావిస్తున్నాయి.

కొంకణ్ ప్రాంతంలో….

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ, శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఒక కూటమిగా బరిలోకి దిగాయి. రెండు పార్టీలో అసంతృప్తులకు కొదవలేదు. రెండు పార్టీలూ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే టిక్కెట్లు కేటాయించారు. దీంతో అన్ని పార్టీల్లో అసంతృప్తుల బెడద తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండు కూటములు విజయం కోసం విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

పట్టుకోల్పోయిన తర్వాత….

మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 75 స్థానాలు కొంకణ్ ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ గట్టిగా సీట్లు సాధిస్తే అధికారం అందుతుందన్నది అందరికీ తెలసిందే. కొంకణ్ ప్రాంతంలో ఒకప్పుడు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్ కు పట్టుండేది. గట్టి ఓటు బ్యాంకు కూడా ఉండేది. అయితే కాలక్రమంలో అది చెల్లాచెదురయిపోయింది. ఈ ప్రాంతంలో పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ మళ్లీ ప్రయత్నిస్తున్నారు.

సానుభూతితో……

తనపై పీఎంసీ బ్యాంకు స్కాం ఆరోపణలు మోపడం, ఈడీ సమన్లు జారీ చేయడం, కేసులు నమోదు చేయడం వంటివి సానుభూతిగా మలుచుకునేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. కొంకణ్ ప్రాంతంలో ఎన్సీపీ 18 సీట్లలోనూ, కాంగ్రెస్ 44 సీట్లలోనూ పోటీ చేస్తుంది. పాల్‌ఘర్, థానే, రత్నగిరి, సింధు దుర్గ్‌ లలో శివసేన బలంగా ఉండటంతో అక్కడ శరద్ పవార్ ప్రత్యేకంగ దృష్టి పెట్టారు. కొంకణ‌్ ప్రాంతంలోనే ముంబయి కూడా ఉండటంతో శరద్ పవార్ ఇది తనకు ఆఖరి ఎన్నికలకుగా ప్రచారం చేసుకుంటున్నారు.

Tags:    

Similar News