ఇక్కడ రివర్స్ ఆపరేషన్… పవార్ ప్రయోగం

దేశమంతటా ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ అమలు చేస్తుంది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతర పార్టీల నేతలను చేర్చుకుని తమ బలం పెంచుకునే ప్రయత్నం [more]

Update: 2021-01-02 17:30 GMT

దేశమంతటా ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ అమలు చేస్తుంది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతర పార్టీల నేతలను చేర్చుకుని తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. బీహార్ లో ఎన్నికలకు ముందు బీజేపీ అలాగే చేసింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోనూ అనేక మందికి బీజేపీ తన పార్టీ కండువాలను కప్పేస్తుంది. కానీ అన్ని చోట్ల సక్సెస్ అవుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు సక్సెస్ కాలేదు. ఇక్కడ సీనియర్ నేత శరద్ పవార్ ఉండటమే కారణమంటున్నారు.

కంటికి రెప్పలా కాపాడుకుంటూ…

శరద్ పవార్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా జారిపోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. శరద్ పవార్ తో ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలకు సులువుగా అపాయింట్ మెంట్ దొరుకుతుంది. తమ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని వస్తున్న ఎమ్మెల్యేలకు శరద్ పవార్ వెంటనే అధికారులకు సూచనలు ఇస్తున్నారు. శరద్ పవార్ చెప్పారంటే ముఖ్యమంత్రి చెప్పినట్లే కావడంతో అధికారులు కూడా వెంటనే ఆ పనులు చేసి పెడుతున్నారు.

ఎమ్మెల్యేలతో మాటా మంతీ….

బీజేపీకి అవకాశమివ్వకుండా శరద్ పవార్ కనీసం వారంలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. వారి సమస్యలను సావధానంగా వింటున్నారట. దీంతో ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఖుషీ అవుతున్నారు. మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ శరద్ పవార్ నిర్లక్ష్యం చేయడం లేదు. వారికి కూడా ఆయన పెద్దదిక్కుగా వ్యవహరిస్తుండటం వల్లనే అసంతృప్తి తలెత్తలేదంటున్నారు.

రివర్స్ ఆపరేషన్…..

ఇక బీజేపీ నేతలకు రివర్స్ లో శరద్ పవార్ గేలం వేస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బీజేపీకి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శరద్ పవార్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ నుంచి అనేక మంది నేతలు ఎన్సీపీలో చేరే అవకాశముంది. ప్రధానంగా పూనే, పింప్రి చించ్వాడ్ ల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలను చేర్చుకుంటున్నారు. బీజేపీ నుంచి వచ్చే వారికి శరద్ పవార్ ద్వారాలు తెరియడంతో బీజేపీకి రివర్స్ ఎటాక్ మొదలయిందంటున్నారు.

Tags:    

Similar News