అంతకు మించి దోపిడీయేగా

తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం అవినీతి ఇసుక లో కురుకుపోయిందన్న ప్రచారం ఆ పార్టీ ని నిండా ముంచింది. హద్దులు దాటిన అవినీతి ఉచిత ఇసుక ముసుగులో [more]

Update: 2020-02-19 02:00 GMT

తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం అవినీతి ఇసుక లో కురుకుపోయిందన్న ప్రచారం ఆ పార్టీ ని నిండా ముంచింది. హద్దులు దాటిన అవినీతి ఉచిత ఇసుక ముసుగులో దర్జాగా సాగిపోయింది. పబ్లిక్ గా ప్రజాప్రతినిధులు సాగించిన ఈ దాష్టికం ఐదేళ్లపాటు యథేచ్ఛగా నడిచింది. ఎన్నికల్లో ప్రలోభాలకు ఓట్లు అవే పడతాయని భావించి ఇసుక ను అడ్డగోలుగా దోచేశారు అన్నది అందరికి తెలిసిన సత్యమే. అయితే జగన్ సర్కార్ దీనిపై వచ్చి రావడంతో చాలా సీరియస్ గా స్పందించింది. పటిష్టమైన కార్యాచరణ ప్రకటించి అమలుకు మాత్రం తాత్సరం చేసింది. ఫలితంగా జనంలో తీవ్ర అసంతృప్తిని విమర్శలను ఎదుర్కొవాలిసి వచ్చింది. అయితే తమ ఆన్ లైన్ విధానం పట్టాలు ఎక్కిన తరువాత అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రజలకు సాంత్వన కలిగించేందుకు సర్కార్ ప్రయత్నాలు చేసింది.

అంతకు మించి దోపిడీ …

వరదలు వచ్చే వరకు ఇసుక విధానం నిర్ణయించలేదు వైసిపి ప్రభుత్వం. అయితే వరదల సమయంలో విధి విధానాలు ప్రకటించినా ఇసుక లభ్యత లేక అంతా అల్లాడిపోయారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం దీనిపై ఆధారపడిన వారు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో విపక్షాలనుంచి ప్రజలనుంచి వెల్లువెత్తిన విమర్శల తరువాత ఇసుక వారోత్సవాలంటూ అందరికి ఇసుకను అందుబాటులో ఉంచింది సర్కార్. ఈ అనందం ఎంతోకాలం లేకుండా పోయింది. చాలా ఇసుక ర్యాంప్ ల మూసివేత తో బాటు కొద్ది ర్యాంప్ లనే ప్రజలకు అందుబాటులో ఉంచడంతో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో లారీ ఇసుక 15 వేలరూపాయలు బ్లాక్ లో పలుకుతుంది. గతంలో టిడిపి లోని కొందరు నేతలు ఇసుకను భోంచేసినా లారీ ఇసుక 5వేలరూపాయలకు మించలేదు. కానీ అంతకు మించి ఇప్పుడు బ్లాక్ లో ఇసుక ను అమ్ముతున్నా అటు అధికారయంత్రాంగం చేష్టలు లేకుండా చూస్తూ ఉండటం మరిన్ని విమర్శలకు తెరతీస్తోంది.

పొంతనలేని సమాధానాలు …

ఈ ఇసుక దందాలపై అధికారపార్టీ నేతల నుంచి మాటలు లేవు. ఇదేమి దారుణమని వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలే వారినుంచి వస్తున్నాయి. ఇదంతా అధికారయంత్రాంగం వైఫల్యమని కొందరు అంటూ ఉంటే మరికొందరు విపక్షంలో ఉన్నప్పటికీ కూడా టిడిపి నాయకులే ఇవన్నీ చేస్తున్నారని చెప్పడం వారి చేతకాని తనానికి నిదర్శనం అన్న విమర్శలు పెల్లుబికుతున్నాయి. అక్రమార్జనకు కొందరు ప్రజాప్రతినిధులు తెరతీయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అధికారయంత్రాంగం నుంచి వినవస్తున్న టాక్. ఎన్నికల్లో ఖర్చుల రికవరీకి ఈ దందాను పార్లమెంట్ సభ్యుల స్థాయిలో వున్నవారే దిగుతున్నారని ఇంకోపక్క టిడిపి సైతం ఆరోపిస్తుంది. అవినీతిపై కొరడా జుళిపిస్తామని ప్రకటించే జగన్ సర్కార్ ఇసుక పై తక్షణం సమీక్షించి చర్యలు తీసుకోకపోతే వైసిపి కి భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవని అంతా అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News