సంచయిత నిజంగా సంచలనమే?

సంచయిత గజపతిరాజుపై విజయనగరం వాసులు మండి పడుతున్నారు. అవగాహన లేమితో సంచయిత చేస్తున్న పనులను వాళ్లు తప్పుపడుతున్నారు. సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన [more]

Update: 2020-05-04 03:30 GMT

సంచయిత గజపతిరాజుపై విజయనగరం వాసులు మండి పడుతున్నారు. అవగాహన లేమితో సంచయిత చేస్తున్న పనులను వాళ్లు తప్పుపడుతున్నారు. సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఇటీవల అప్పన్న ఆలయంలోనూ సంచయిత లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న వార్తలు వచ్చాయి. అదే సమయంలో సంచయిత తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది.

కరోనా ఫ్రీ జిల్లాగా…..

విజయనగరం జిల్లా ఇప్పటి వరకూ కరోనా ఫ్రీ జిల్లాగా ఉంది. గత నెల రోజుల పైనుంచి అన్ని జిల్లాలకు కరోనా వైరస్ సోకినా విజయనగరం జిల్లా ఛాయలకు మాత్రం ఆ వైరస్ రాలేకపోయింది. ఇందుకు అధికారుల పకడ్బందీ చర్యలే కారణం కావచ్చు. సరిహద్దులో ఉన్న విశాఖపట్నంలో కేసులు ఉన్నా విజయనగరంలో మాత్రం ఒక్క కేసు కూడా ఇంతవరకూ నమోదు కాలేదు. శ్రీకాకులం జిల్లాలో సయితం కేసులు నమోదయ్యాయి.

చెన్నై నుంచి రావడంతో…..

అయితే సంచయిత తన పీఏను చెన్నై నుంచి విజయనగరం తీసుకు రావడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సంచయిత గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత పీఏను నియమించుకున్నారు. ఆయన చెన్నైకి చెందిన వ్యక్తి. అయితే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సంచయిత పీఏ విజయనగరం జిల్లాకు వచ్చారు. ఆయన మాన్సాస్ ట్రస్ట్ గెస్ట్ హౌన్ లో బస చేయడం వివాదానికి దారి తీసింది.

లాక్ డౌన్ నిబంధనలను…..

సంచయిత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తన పీఏను ఎలా జిల్లాకు తీసుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. చైన్నైలో కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ సంచయిత ఇలాంట ినిర్ణయం ఈ సమయంలో ఎందుకు తీసుకున్నారని ఆమెను నిలదీస్తున్నారు. దీనిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు కూడా చూసీ చూడనట్లు వదిలేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద సంచయిత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తన పీఏను జిల్లాకు రప్పించడం రగడగా మారింది.

Tags:    

Similar News