శ‌మంత‌క‌మ‌ణి కుటుంబం కోరి క‌ష్టాలు తెచ్చుకుందా?

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే శ‌మంత‌క‌మ‌ణి ఫ్యామిలీ రాజ‌కీయాలు ముగిసిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా టీడీపీ ఓ వెలుగు వెలిగిన ఈ కుటుంబం.. చంద్రబాబు అధికారంలో ఉన్నస‌మ‌యంలో [more]

Update: 2020-12-13 00:30 GMT

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే శ‌మంత‌క‌మ‌ణి ఫ్యామిలీ రాజ‌కీయాలు ముగిసిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా టీడీపీ ఓ వెలుగు వెలిగిన ఈ కుటుంబం.. చంద్రబాబు అధికారంలో ఉన్నస‌మ‌యంలో ప‌దవులు కూడా అనుభ‌వించింది. పార్టీ ఈ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 2014లో శ‌మంత‌క‌ణి కుమార్తె యామినిబాల‌కు శింగ‌మ‌న‌ల టికెట్ ఇచ్చి గెలిచేలా ప్రోత్సహించింది. ఇక‌, ప్రభుత్వ విప్‌గా కూడా యామినీ బాలకు అవ‌కాశం ఇచ్చారు చంద్రబాబు. అంతేకాదు.. శ‌మంత‌క‌మ‌ణికి ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు. ఎస్సీ వ‌ర్గంలో ఎంతో మంది నేత‌ల‌ను కాద‌ని మ‌రీ చంద్రబాబు ఒకే కుటుంబంలో త‌ళ్లీ, కూతుళ్లు ఇద్దరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చారు.

ఇంత ప్రోత్సహించినా….

ఇంత‌లా ప్రోత్సహించిన శ‌మంత‌క‌మ‌ణి కుటుంబం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవడంలోను పూర్తిగా విఫ‌ల‌మైంది. నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది. దీంతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌ల్లీ కుమార్తెల మ‌ధ్యే రాజ‌కీయ వైరుధ్యాలు చోటు చేసుకున్నాయి. త‌ల్లి అయితే ఏకంగా కూతురుకు వ్యతిరేకంగా రాజ‌కీయాలు చేయాల్సినంత స్థాయిలో వీరి మ‌ధ్య గొడ‌వ పెరిగింది. ఈ ప‌రిణామాల‌తో చంద్రబాబు వీరిని ప‌క్కన పెట్టి జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌ర్గానికి చెందిన బండారు శ్రావ‌ణికి శింగ‌న‌మ‌ల సీటు ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో అక్కడ టీడీపీ ఓట‌మి అనంత‌రం పార్టీ త‌మ‌కేదో అన్యాయం చేసింద‌ని ఆరోపిస్తూ త‌ళ్లీకూతుళ్లు ఇద్దరూ పార్టీ మారీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అంతా శూన్యమే….

ఎవ‌రికి న‌చ్చిన పార్టీలో వారు చేర‌వ‌చ్చు. కానీ, ఇలా చేరేప్పుడు త‌మ రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి క‌దా.. అంటే.. అక్కడే శ‌మంత‌క‌మ‌ణి కుటుంబం పెద్ద త‌ప్పట‌డుగు వేసింది. వైసీపీలోకి చేరిపోయారు. మ‌రి ఇప్పుడు వారి ప్యూచ‌ర్ ఏంట‌న్నది ప‌రిశీలిస్తే శూన్యమే క‌నిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు ఉన్న జోరు.. హోరు.. హుషారు.. ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. పార్టీలో ప‌ట్టించుకునేవారు కూడా లేరు. జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి దూకుడు ముందు శ‌మంత‌క‌మ‌ణి రాజ‌కీయాలు ఏమాత్రం ప‌నిచేయ‌డం లేదు. పైగా ప‌ద్మావ‌తి ఆమె భ‌ర్త సాంబ‌శివారెడ్డి జ‌గ‌న్‌కు ద‌గ్గర కావ‌డంతో పాటు ఆమె ప్రక్షాళ‌న‌లో కేబినెట్ రేసులో ఉన్నార‌న్న వార్తల‌తో ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత స్ట్రాంగ్ అవుతోన్న ప‌రిస్థితి.

బేల చూపులు చూస్తూ…..

మొత్తంగా చూస్తే.. టీడీపీలో ఒక కీల‌క నాయ‌కురాలిగా ఉండి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని శాసించిన శ‌మంత‌క‌మ‌ణి కుటుంబం.. ఇప్పుడు బేల చూపులు చూస్తోంద‌నే అంటున్నారు నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ లేనే లేదు. ఫ్యూచ‌రూ క‌నిపించ‌డం లేదు. మొత్తానికి టీడీపీ వ‌దిలి ఈ కుటుంబం సాధించింది ఏమీలేదు. జేసీపైనో, చంద్రబాబుపైన కోపంతోనే వీరు జ‌గ‌న్ పార్టీ జెండా క‌ప్పుకున్నా ఇక్కడ వాళ్లను ప‌ట్టించుకునే వాళ్లే లేరు.

Tags:    

Similar News