బీహార్ మే … భాయీ… భాయీ…

బీహార్ రాజకీయాలంటే ఎక్కువగా కులాలు మాత్రమే కన్పిస్తాయి. బీసీలు, మైనారీటీలు ఎక్కువగా ఉన్న బీహార్ తొలి నుంచి కులాల ఆధిపత్యం కొనసాగుతుంది. కులం చూసి ఓటేయ్యడాన్ని బీహార్ [more]

Update: 2020-09-28 17:30 GMT

బీహార్ రాజకీయాలంటే ఎక్కువగా కులాలు మాత్రమే కన్పిస్తాయి. బీసీలు, మైనారీటీలు ఎక్కువగా ఉన్న బీహార్ తొలి నుంచి కులాల ఆధిపత్యం కొనసాగుతుంది. కులం చూసి ఓటేయ్యడాన్ని బీహార్ లో గత దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్ కులాల ఓట్లపైనే ఎక్కవుగా ఆధారపడింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు తొలి నుంచి రాజకీయంగా సహకరించింది కూడా కులం కావడమే గమనార్హం.

మరికొద్ది రోజుల్లోనే….

యాదవులు అత్యధికంగా ఉండటంతో ఎక్కువ మంది లాలూ ప్రసాద్ పార్టీ వైపే మొగ్గు చూపుతుంటారు. అదే ఈ పార్టీకి తొలి నుంచి కలసి వస్తున్న అంశంగా చెప్పాలి. ప్రస్తుతం బీహార్ లో ఎన్నికల వాతావరణం ఉంది. బీహార్ లో మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ లు కలసి కూటమిగా బీహార్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమిని ఎదుర్కొనబోతున్నాయి.

సమాజ్ వాదీ మద్దతు…..

ఈ సమయంలో బీహార్ లో ఆర్జేడీకి ఒక శుభావార్త విన్పించింది. ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఆర్జేడీకి మద్దతు ప్రకటించింది. అక్కడ కూడా కులాల ఈక్వేషన్లు ఉండటంతో అఖిలేష్ యాదవ్ ఆర్జేడీకి మద్దతు ప్రకటించారు. తాము బీహార్ లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీనివల్ల యాదవుల ఓట్లు చీలవు. అదే సమాజ్ వాదీ పార్టీ బరిలోకి అభ్యర్థులను దింపి ఉంటే యాదవులు ఎస్పీిని కూడా ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించేవారు. సమాజ్ వాదీ పార్టీ మద్దతు ప్రకటన ఆర్జేడీకి నైతికంగానే కాదు ఓట్ల పరంగా కూడా కొంత లాభమేనంటున్నారు.

సీట్ల పంపిణీ సక్రమంగా జరిగితే…..

ముస్లిం ఓట్లను సాధించుకునేందుకు కాంగ్రెస్, ఆర్జేడీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీని సహజంగానే వ్యతిరేకించే ముస్లిం ఓట్లు తమకు అనుకూలంగా పడతాయని ఆర్జేడీ, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. మోదీ పాలనపై వ్యతిరేకత సయితం తమకు అనుకూలంగా మారుతుందంటు న్నారు. మాంఝీ వంటి నేతలు కూటమి నుంచి జారి పోవడంతో కొంత కలవరం చెందిన ఆర్జేడీకి సమాజ్ వాదీ పార్టీ మద్దతు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. అయితే సీట్ల సర్దుబాటు సక్రమంగా చేసుకుని ఎన్నికలకు వెళితే ఆర్జేడీ కూటమి విజయం పెద్దకష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News