వందశాతం ఫెయిల్ చేయాలనేనా?

జాతీయ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడైనా ఏమాత్రం కంఫర్ట్ గా లేరు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన శైలజానాధ్ కు సీనియర్ నేతలు ఎవరూ సహకరించడం లేదు. [more]

Update: 2020-07-26 11:00 GMT

జాతీయ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడైనా ఏమాత్రం కంఫర్ట్ గా లేరు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన శైలజానాధ్ కు సీనియర్ నేతలు ఎవరూ సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాను స్పందిస్తున్నా, సీనియర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాల పర్యటనకు వెళుతున్నా సీనియర్ నేతలు ముఖం చాటేస్తున్నారు. శైలజనాధ్ కు సీనియర్లు ఎవరూ సహకరించడం లేదు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నేతలు జగన్ ను ప్రశంసిస్తుడటం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది.

ఏడు నెలలు గడుస్తున్నా…..

శైలజానాధ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా సీనియర్ నేతలు ఎవరూ ఆయనకు సహకరించడం లేదు. పార్టీ కార్యక్రమాలను చేపట్టేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. అరకొర నేతలు మాత్రమే మిగిలారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. దీంతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ ఇప్పుడు కన్పించని పరిస్థితి.

సీనియర్ నేతలు ఎవరూ…

శైలజానాధ్ నియామకం ఎవరూ ఊహించలేదు. ఆయనకు పోటీగా చింతామోహన్, జేడీశీలం, పల్లంరాజు వంట నేతలు పోటీ పడ్డారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యం, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవాన్ని అధిష్టానాన్ని పరిగణనలోకి తీసుకుంది. తులసిరెడ్డిని పార్టీ వర్కింగ్ర ప్రెసిడెంట్ గా నియమించింది. అయితే సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటూనే ఆయనతో కలసి రావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా స్పందన లేదు.

పొరుగు రాష్ట్రాల నేతలు….

దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నేతలు శైలజానాధ్ కు తలనొప్పిగా మారారు. దళిత ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ పార్టీకి తెచ్చేందుకే శైలజానాధ్ కు పదవి అప్పగించారు. అయితే పొరుగు రాష్ట్రాల నేతలు సిద్ధరామయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జగన్ పాలనను మెచ్చుకుంటుండటం శైలజానాధ్ కు తలనొప్పిగా మారింది. దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలన్న యోచనలో శైలజానాధ్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద శైలజానాధ్ కు సొంత పార్టీ నేతలే ఇబ్బందిగా మారారు.

Tags:    

Similar News