సాకే వ్యూహం ఇదేన‌ట‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యత‌లు చేప‌ట్టిన సాకే శైలజానాథ్ ముందు రెండు కీల‌క ల‌క్ష్యాలు ఉన్నాయి. కానీ, ఆయ‌న ద‌గ్గర మాత్రం ఉన్నది ఒక‌టే అస్త్రం అంటున్నారు [more]

Update: 2020-02-22 00:30 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యత‌లు చేప‌ట్టిన సాకే శైలజానాథ్ ముందు రెండు కీల‌క ల‌క్ష్యాలు ఉన్నాయి. కానీ, ఆయ‌న ద‌గ్గర మాత్రం ఉన్నది ఒక‌టే అస్త్రం అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి కాంగ్రెస్‌కు ఇప్పుడు పుంజుకునేందుకు ఏపీలో మంచి గ్యాప్ ఉంది. మ‌రి దీనిని స‌ద్వినియోగం చేసుకునేలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంద‌నే అంటున్నారు ఆ పార్టీ సీనియ‌ర్లు. సాకే శైల‌జానాథ్‌ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌ కొంత మేర‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ల ఆలోచ‌న‌లు కూడా మారు తున్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియ‌ర్లు.. ఇప్పుడు ఆ పార్టీవైపు చూస్తున్నార‌ట‌.

ఘర్ వాపసీ అంటూ…..

సాకే శైలజానాధ్ ముందున్న రెండు ల‌క్ష్యాల్లో ఒక‌టి ఘర్ వాప‌సీ. చాలా మంది సీనియ‌ర్లు, గ‌తంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు కూడా పార్టీని వీడి ప‌క్క పార్టీల్లోకి జంప్ చేశారు. అయినా కూడా ఎవ‌రూ కూడా స‌క్సెస్ కాలేదు. క‌నీసం మెజారిటీ మార్కు ఓట్లు కూడా రాబ‌ట్టుకోలేక పోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీరంతా కూడా స‌రైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్‌కు సార‌ధి మార‌డంతో త‌మ రాజ‌కీయ వ్యూహం కూడా మారుతుంద‌ని వారు ఎదురు చూస్తున్నారు. అంటే సాకే శైలజానాధ్ కొంత వారితో చ‌ర్చలు జ‌రిపితే తిరిగి వ‌చ్చి పార్టీలో చేరేందుకు చాలా మంది ప్రతి జిల్లాలోనూ ఎదురు చూస్తున్నారు.

హోదా విషయంలో…

ఇక‌, రెండో ల‌క్ష్యం పార్టీని మ‌ళ్లీ పున‌ర్వైభ‌వం దిశ‌గా న‌డిపించ‌డం. అయితే, ఈ ల‌క్ష్యాలు సాధించేందుకు సాకే శైలజానాధ్ వ‌ద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? ప్రజ‌ల‌ను స‌మీక‌రించాలి. నేత‌ల‌ను పార్టీ వైపు మ‌ళ్లించుకోవాలి ఇలా ఆయ‌న చాలానే చేయాలి. కానీ, ఇవి గ‌తంలోనూ ర‌ఘువీరా ప్రక‌టించారు. కానీ, స‌క్సెస్ కాలేక పోయారు. ఈ నేప‌థ్యంలో సాకే శైలజానాధ్ ముందున్న కీల‌క‌మైన మార్గం . ప్రజ‌లు ఇప్పటికీ ఆశ‌లు పెట్టుకున్న ప్రత్యేక హోదా. అయితే దీనిని కూడా గ‌తంలో ఇస్తామ‌ని చెప్పినా ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లడంలో విఫ‌ల‌మ‌య్యారు.

నాలుగేళ్ల సమయం ఉండటంతో…..

అయితే ఇప్పుడు ఎన్నిక‌ల‌కు నాలుగేళ్ల విరామం ఉన్న నేప‌థ్యంలో సాకే శైలజానాధ్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తే ఈ ప‌థ‌కం పారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే టైంలో సాకే ఎస్సీ వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఈ వ‌ర్గం ఓట‌ర్లలో, నేత‌ల్లో మార్పులు తేవ‌డం ద్వారా వీరిని త‌మ వైపున‌కు తిప్పుకోవాల‌న్న ఆలోచ‌న కూడా కాంగ్రెస్‌కు ఉంది. వాస్తవంగా స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్పటి నుంచి కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు ఏపీలో వైసీపీకి వ‌న్‌సైడ్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సాకే శైలజానాధ్ అస్త్రాలు, కాంగ్రెస్ ప్లాన్లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News