కొత్త క్యాబినేట్ లోకి సజ్జల… ?

జగన్ కొత్త మంత్రి వర్గం గురించి అపుడే ఊహాగానాలు చాలా వినిపిస్తున్నాయి. జగన్ ఈసారి ఏర్పాటు చేయబోయేది కచ్చితంగా ఎన్నికల క్యాబినెట్. సమర్ధులు నోరున్న వారు అందులో [more]

Update: 2021-09-08 14:30 GMT

జగన్ కొత్త మంత్రి వర్గం గురించి అపుడే ఊహాగానాలు చాలా వినిపిస్తున్నాయి. జగన్ ఈసారి ఏర్పాటు చేయబోయేది కచ్చితంగా ఎన్నికల క్యాబినెట్. సమర్ధులు నోరున్న వారు అందులో వచ్చి చేరుతారు. ఇక జగన్ మాటే వేదంగా భావించే వారు కూడా ఈసారి మంత్రులుగా కనిపిస్తారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వారికే పెద్ద పీట వేస్తారని అంటున్నారు. అలా కనుక ఆలోచిస్తే ఇపుడున్న ఎమ్మెల్యేలు కాకుండా కొత్త వారు కూడా మంత్రులుగా వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆయనే నీడ …

వైఎస్సార్ కి ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే జగన్ కి నీడ తోడు అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెబుతారు. జగన్ మనసులో ఏముందో అదే సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంట వస్తుంది. అంతకు మించి ఒక్క అక్షరం కూడా ఆయన కొత్తగా చేర్చరు, పేర్చరు అంటారు. ఇక జగన్ కి అధికార ప్రతినిధి అయినా ఆయనే, అంతరాత్మ అయినా ఆయనే అంటారు. జగన్ దగ్గర సజ్జలకు ఉన్న చనువు ఎవరికీ లేదు. ఆయన మంత్రులందరి కంటే పెద్ద మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి సేవలను జగన్ ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారుట.

అది నిజమేనా..?

క్యాబినేట్ విస్తరణ అంటూ చేపడితే ఎవరూ ఊహించని వారే మంత్రులు అవుతారు అన్న టాక్ చాలా కాలంగా ఉంది. జగన్ తొలి మంత్రి వర్గంలోనే ఎన్నో వింతలూ విశేషాలూ చూపించారు. ఈసారి దానికి మించి కధ ఉంటుంది అంటున్నారు. ఇక జగన్ సీఎం అయ్యే నాటికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమీ కారు. ఆయన ఊసు కూడా పెద్దగా ఎక్కడా వినిపించలేదు. కానీ ఇపుడు మాత్రం సజ్జల సర్వశ్వంగా ఉన్నారు. ఆయనే కన్నూ ముక్కూ చెవి అని కూడా చెబుతారు. అలాంటి సజ్జల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. అదే కనుక జరిగితే సజ్జల మంత్రి కావడం ఖాయమే అంటున్నారు.

ట్రబుల్ షూటర్ గా ..?

సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఇపుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఫలనా పదవి లో ఉన్నారు అని చెప్పకపోయినా అనుకున్న దాని కంటే ఎక్కువ అధికారాలే ఆయనకు ఉన్నాయి. దాంతో సజ్జలను నేరుగా తీసుకువచ్చి మంత్రిని చేస్తే విపక్షాల విమర్శలు తప్పుతాయి. జగన్ కి కూడా అతి పెద్ద భారం కూడా దించుకున్నట్లుగా ఉంటుంది అంటున్నారుట. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాలో మీడియా ముందుకు వస్తున్నారు అని ప్రశ్నించే వారికి కూడా సరైన సమాధానం కూడా ఇచ్చినట్లు అవుతుందిట. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు పక్కన ఉండాలనుకోవడం జగన్ కి కూడా అనివార్యమే ఈ పరిస్థితులలో అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం నిజమవుతుందో లేదో.

Tags:    

Similar News