స‌జ్జల అలా స‌క్సెస్ అయ్యారా… సీనియ‌ర్ల మాట ?

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ప్రభుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి పార్టీలో నెంబ‌ర్ 2 స్థానం ద‌క్కింది. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న ఎవ‌రో కేవ‌లం [more]

Update: 2021-02-27 08:00 GMT

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ప్రభుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి పార్టీలో నెంబ‌ర్ 2 స్థానం ద‌క్కింది. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న ఎవ‌రో కేవ‌లం వైసీపీలోని కీల‌క నాయ‌కుల‌కు మాత్రమే తెలుసు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ త‌న రెడ్డి సామాజిక వ‌ర్గంలో త‌న‌కు న‌మ్మిన బంట్లుగా ఉన్న వారికి ప్రాంతాలు, జిల్లాల వారీగా ఇన్‌చార్జ్ బాధ్యత‌లు అప్పగించారు. అప్పట్లో అంతా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఉత్తరాంధ్రలో విజ‌య‌సాయి రెడ్డి వాళ్ల హ‌వానే ఎక్కడ చూసినా క‌నిపించేది. అప్పుడు సుబ్బారెడ్డి, సాయిరెడ్డితో పోలిస్తే స‌జ్జల వెన‌క ర్యాంకులోనే ఉండేవారు. క‌ట్ చేస్తే పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచే సుబ్బారెడ్డి రేసులో సైడ్ అయిపోగా.. ఆ త‌ర్వాత కొద్ది రోజులు పాటు హ‌వా కొన‌సాగించిన విజ‌యసాయి ప్రాధాన్యత కూడా త‌గ్గింద‌ని వైసీపీలోనే వినిపించే గుస‌గుస.

ఆరు నెలల నుంచి……

ఇటీవ‌ల ఆరు మాసాలుగా మాత్రం.. పార్టీలో ఎవ‌రు ఏం చెప్పుకోవాలన్నా.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గర‌కు ఎలాంటి అంశం తీసుకువెళ్లాల‌ని అనుకున్నా.. సజ్జల రామకృష్ణారెడ్డి కీల‌క రోల్ పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వం త‌ర‌ఫున తీసుకునే నిర్ణయాల్లోనూ ప్రతి వాటిలో ఆయ‌న జోక్యం ఉంటోంది. అంతేకాదు.. ప్రభుత్వం వాయిస్ వినిపించేందుకు గ‌తంలో మంత్రులు ఒక‌రిద్దరు రంగంలోకి దిగేవారు. ముఖ్యంగా కుర‌సాల క‌న్నబాబు, పేర్ని నాని వంటివారు మీడియా ముందుకు వ‌చ్చి.. వైసీపీ విధానాల‌ను.. ప్రభుత్వ వైఖ‌రిని చెప్పేవారు. అదే స‌మ‌యంలో టీడీపీపై విమ‌ర్శలు కూడా చేసేవారు. అయితే.. ఇప్పుడు ఇది మారిపోయింది. అంతా స‌జ్జల వారి హ‌యాంలోనే సాగుతోంది. ఆయ‌న నేతృత్వంలోనే మీడియా మీటింగులు జ‌రుగుతున్నాయి. ప్రతి విష‌యంలోనూ ఆయ‌నే మాట్లాడుతున్నారు.

కీలక నిర్ణయాల్లోనూ…..?

ఇక మంత్రులు సైతం త‌మ శాఖ‌ల్లో కీల‌క నిర్ణయాలు తీసుకోవాల‌నుకున్నా కూడా చాలా వ‌ర‌కు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యమే ఎక్కువుగా ఉందంటున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? కేవ‌లం 20 నెల్లలోనే పార్టీలో స‌జ్జల‌ నెంబ‌ర్ టూ ఎలా అయ్యారు ? పార్టీ వాయిస్ వినిపించ‌డంలో ఆయ‌న ఎలా స‌క్సెస్ అయ్యారు.. జ‌గ‌న్ ద‌గ్గర ఎలా మంచి మార్కులు సంపాయించుకున్నారు ? అనేది ఆస‌క్తిగా ఉంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి మిగిలిన వారికి తేడా.. ఆచితూచి వ్యవ‌హ‌రించ‌డం…సూటి విమ‌ర్శలు.. దూకుడు లేని వ్యవ‌హారం.. వివాద ర‌హిత‌మైన వ్యవ‌హారాలు వంటివే ఆయ‌న‌కు ప్లస్ కావ‌డంతో పాటు ఆయ‌న్ను జ‌గ‌న్‌కు మరింత ద‌గ్గర చేశాయ‌ని అంటున్నారు.

అమితమైన ప్రయారిటీ…..

టీడీపీ నేత‌లు కాని.. ఇత‌ర ప్రతిప‌క్ష నేత‌లు కావొచ్చు.. అటు సొంత పార్టీలోనే కొంద‌రు సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిని టార్గెట్ చేసిన‌ట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడూ టార్గెట్ చేయ‌రు. ఇక జిల్లాలో పార్టీ నేత‌ల అంత‌ర్గత స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే విష‌యంలోనూ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయి లాంటి వాళ్లు సొంత పార్టీ నేత‌ల్లో ఏదో ఒక వ‌ర్గానికి కొమ్ము కాస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎక్కువుగా ఎదుర్కొంటున్నారు. ఆ విమ‌ర్శల‌కు స‌జ్జల దూరంగా ఉంటున్నారు. ఆయ‌న ప్రతిప‌క్షాల‌పై సైతం నిర్మాణాత్మక‌మైన విమ‌ర్శలు చేయ‌డం కూడా న్యూట్రల్ జ‌నాల్లోనూ ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డేలా చేస్తోంది. ఇవ‌న్నీ ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నందునే జ‌గ‌న్‌కు సజ్జల రామకృష్ణారెడ్డికి అమిత‌మైన ప్రయార్టీ ఇస్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Tags:    

Similar News