సచిన్ అందుకే తలొగ్గారా?

కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ రాజీ పడింది ఎందుకు? అధిష్టానం నుంచి ఏం హామీ లభించింది? నెలరోజుల పాటు హడావిడి చేసిన సచిన్ పైలట్ తిరిగి లొంగిపోవడానికి [more]

Update: 2020-08-18 17:30 GMT

కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ రాజీ పడింది ఎందుకు? అధిష్టానం నుంచి ఏం హామీ లభించింది? నెలరోజుల పాటు హడావిడి చేసిన సచిన్ పైలట్ తిరిగి లొంగిపోవడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. సచిన్ పైలట్ కు రానున్న కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ లభించినట్లు తెలుస్తోంది. ఆ హామీ వల్లనే సచిన్ పైలట్ తన వర్గంతో కలసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారంటున్నారు.

ఎప్పటికైనా తనకు…..

సచిన్ పైలట్ ఆరేళ్ల పాటు రాజస్థాన్ పీసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యారు. అయితే సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యువనేత కావడం, రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక వర్గం ఉండటంతో అధిష్టానం నిర్ణయంతో ఒకింత నిరాశకు గురైనా సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు.

అశోక్ గెహ్లాత్ ను ఇప్పటికిప్పుడు…..

కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అశోక్ గెహ్లాత్ సచిన్ పైలట్ వర్గాన్ని తొక్కి వేయడానికే ఎక్కువ సమయం కేటాయించారంటున్నారు. అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ ల మధ్య 18 నెలల పాటు మాటల్లేవ్ అంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అధిష్టానం సయితం పట్టించుకోలేదు. దీంతోనే సచిన్ పైలట్ థిక్కార స్వరం విన్పించారు. అయితే రాహుల్, ప్రియాంక ల నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే తిరిగి సచిన్ పైలట్ సొంత గూటికి చేరారంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో….

ఇప్పటికిప్పుడు అశోక్ గెహ్లాత్ ను తప్పించకపోయినా ముఖ్యమంత్రి గ్యారంటీ అనే సచిన్ పైలట్ కు హామీ లభించిందంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల పాటు పంచాలని సచిన్ పైలట్ చేసిన విజ్ఞప్తిని రాహుల్, ప్రియాంకలు సున్నితంగా తిరస్కరించారంటున్నారు. అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పడంతోనే సచిన్ పైలట్ తలొగ్గారన్నది ఆ వర్గం నుంచి విన్పిస్తున్న మాట. మరో మూడేళ్లలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్ పైలట్ ను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి చేరారు.

Tags:    

Similar News