సచిన్ అవసరం మళ్లీ కావాల్సి వచ్చిందిగా?

రాజస్థాన్ రాష్ట్రంలో సచిన్ పైలట్ ది ప్రత్యేక పాత్ర. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానే అయి వ్యవహరించిన పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ తాను [more]

Update: 2021-04-13 17:30 GMT

రాజస్థాన్ రాష్ట్రంలో సచిన్ పైలట్ ది ప్రత్యేక పాత్ర. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానే అయి వ్యవహరించిన పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ తాను ఊహించుకున్నట్లు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. దీంతో సచిన్ పైలట్ కొన్నా ళ్ల క్రితం అసంతృప్తిని వెళ్లగక్కారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సముదాయించడంతో సచిన్ పైలట్ శాంతించారు. సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ల మధ్య సమన్వయం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఉప ఎన్నికలతో….

అయితే రాజస్థాన్ లో ఇప్పుడు ఉప ఎన్నికలతో మరోసారి అశోక్ గెహ్లాత్ కు సచిన్ పైలట్ అవసరం ఏర్పడింది. రాజస్థాన్ లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు స్థానాలు చిన్న సంఖ్య కావచ్చు కాని ప్రభుత్వానికి మాత్రం ఈ సంఖ్య చాలా పెద్దదనే చెప్పాలి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సచిన్ పైలట్ అవసరం మరింత గా ఏర్పడింది. ఈ మూడు స్థానాల్లో రెండింటిలో గుజ్జర్ల సామాజికవర్గం అధికంగా ఉండటమే ఇందుకు కారణం.

మద్దతు దారులు దూరంగా…..

అశోక్ గెహ్లాత్ ఈ ఎన్నికల్లోనూ సచిన్ పైలట్ మద్దతు దారులను దూరంగా ఉంచారు. కనీసం ప్రచారంలో కూడా వారికి చోటు కల్పించలేదు. దీంతో సచిన్ పైలట్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నేత సచిన్ పైలట్ ను అవసరానికి వాడుకోవడం తప్ప తమకు ప్రాధాన్యత లేదని మరోసారి వారు అశోక్ గెహ్లాత్ పై విరుచుకుపడుతున్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చిందుకు అజయ్ మాకెన్ రంగంలోకి దిగారు.

సచిన్ ప్రభావం ఉంటుందనే?

రెండు స్థానాల్లో సచిన్ పైలట్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గెలవాలంటే సచిన్ మనస్ఫూర్తిగా మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం నామినేషన్ల సందర్భంగా సచిన్ పైలట్, అశోక్ గెహ్లాత్ లను ఒకే వేదికపైకి తేగలిగారు. అయితే సచిన్ పైలట్ మద్దతుదారులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు కూడా వర్గాలుగా విడిపోయి ఉన్నారు. వీరందరినీ ఒకతాటిపైకి తేవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఉప ఎన్నికల వేళ అశోక్ గెహ్లాత్ కు మరోసారి సచిన్ పైలట్ అవసరం ఏర్పడింది.

Tags:    

Similar News