ఇక పైలట్ నే హైలెట్ చేయనున్నారా?

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సయితం బీజేపీ నేతలతో వరస సమావేశాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ [more]

Update: 2021-02-15 17:30 GMT

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సయితం బీజేపీ నేతలతో వరస సమావేశాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను నిలువరించడానికి అవసరమైన వ్యూహరచనను ఇప్పటి నుంచే బీజేపీ మొదలు పెట్టింది. కానీ కాంగ్రెస్ లో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. అశోక్ గెహ్లాత్ ను ఈసారి ఎన్నికల బాధ్యత నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయనకు సంకేతాలు అందినట్లు చెబుతున్నారు.

రాహుల్ పార్టీ అధినేతగా…..

త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారు. రాహుల్ తొలి నుంచి అశోక్ గెహ్లాత్ సేవలను జాతీయంగా పార్టీకి ఉపయోగించుకోవాలని రాహుల్ భావిస్తున్నారు. అందుకే ముందుగానే అశోక్ గెహ్లాత్ ను పార్టీలో కీలక పదవి అప్పగించి ఆయనను ఢిల్లీకి పరిమితం చేయాలని భావిస్తున్నారు. అశోక్ గెహ్లాత్ అంగీకరించకపోయినా ఎన్నికలకు ముందు మాత్రం ఇది జరిగి తీరుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పైలట్ కు ప్రాధాన్యత…..

మరోవైపు సచిన్ పైలట్ కు రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల పూర్తి బాధ్యతలను సచిన్ పైలెట్ కే అప్పగించాలన్నది రాహుల్ అభిప్రాయంగా ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అశోక్ గెహ్లాత్ ప్రభుత్వ పనితీరు కన్నా, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనేనని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. అశోక్ గెహ్లాత్ కు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసి తప్పు చేశామన్న భావనలో రాహుల్ గాంధీ ఉన్నారు.

గెహ్లాత్ కు జాతీయ రాజకీయాలను….

దీంతో పాటు సచిన్ పైలట్ ఇటీవల అసంతృప్తితో బయటకు వెళ్లిపోయిన సందర్భంలో రాహుల్, ప్రియాంకలు రంగంలోకి దిగి బుజ్జగించారు. ఆ ఫలితంగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. దీనికి తోడు రాజస్థాన్ లో ఉన్న సెంటిమెంట్ ప్రకారం అధికార పార్టీకి విజయం దక్కే అవకాశాలు లేవు. మార్చి మార్చి రాజస్థాన్ ప్రజలు పార్టీలకు అధికారాన్ని కట్టబెడుతుంటారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ కే బాధ్యతలను అప్పగించడం మంచిదన్న అభిప్రాయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది.

Tags:    

Similar News