కాలం కలసి రాలేదంతే?

సబ్బం…… కాలం కలిసి రాక ఇలా అయిపోయారు కానీ, నిలకడగా ఉండి ఉంటే ఎక్కడో ఉండాల్సిన మనిషి….. ఇప్పుడు జగన్ చుట్టూ చేరి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు [more]

Update: 2021-05-04 08:00 GMT

సబ్బం…… కాలం కలిసి రాక ఇలా అయిపోయారు కానీ, నిలకడగా ఉండి ఉంటే ఎక్కడో ఉండాల్సిన మనిషి….. ఇప్పుడు జగన్ చుట్టూ చేరి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు లేని కాలంలో, కాంగ్రెస్ పార్టీ వాళ్లంతా జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తున్న కాలంలో సబ్బం హరి ఒక్కడే ఆయన వైపు నిలిచాడు. జగన్ కూడా అంతే స్థాయిలో ఆయన్ని నమ్మాడు.

తన వాహనంలోనే…

తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే సబ్బం హరిని వెంట పెట్టుకుని జగన్ తిరిగేవారు. పార్లమెంట్ నుంచి వచ్చేప్పుడు ఆయన ఫ్లాట్ వద్ద డ్రాప్ చేసేవారు. కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపే కుట్రలు జరిగినపుడు, ఓదార్పు యాత్రను అడ్డుకున్నపుడు, కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి సోనియాను ధిక్కరించినపుడు సబ్బం హరి ఆయన వెంటే ఉన్నారు.ఆ తర్వాతే తేడా వచ్చింది.

తేడా వచ్చిందెక్కడంటే?

ఎవరి ప్రోద్భలంతో జరిగిందో కానీ జగన్ ప్రతి కదలిక ప్రత్యర్థులకు తెలిసిపోయేది. జగన్ జైలు పాలైనప్పుడు, కేసుల మీద కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసినప్పుడు జగన్ తరపున చాలామంది వకాల్తా తీసుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే కావూరి చొరవతో ఓసారి వైఎస్ విజయమ్మ సోనియాతో భేటి జరిగింది.ఈ భేటీలో ఏమి జరిగింది అనేది బయటకు తెలియక పోయినా, ఎవరికి తెలియని ఆ భేటి గురించి బయటకు పొక్కింది. కావూరి జగన్ కి సాయం చేస్తున్నాడని ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఆ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

అప్పటి నుంచే దూరం….

ఆ తర్వాత సబ్బంహరికి జగన్మోహన్ రెడ్డితో దూరం పెరిగింది. కడప ఉప ఎన్నికల నాటికి జగన్ రాజకీయ గురువు తానేనని చెప్పుకునే వరకు సబ్బం హరి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే రాజకీయ ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. చివరకు సబ్బం హరితో సంబంధం లేదని జగన్ తేల్చేసే వరకు వెళ్లింది. ఎవరి ప్రయోజనాల కోసం సబ్బం హరి ఆ పని చేశారో తెలీదు కానీ, జగన్ వెన్నంటే ఉంటే ఆయన తలరాత మరోలా ఉండేది.

 

-శరత్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News